Xiaomi Launch : షావోమీ తన తాజా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో నాలుగో మోడల్‌గా Xiaomi 17 Ultra స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గతంలో విడుదలైన Xiaomi 15 Ultraకి అప్డేట్ గా మార్కెట్‌లోకి వచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
ధర విషయానికి వస్తే, Xiaomi 17 Ultra ప్రారంభ ధర చైనాలో CNY 6,999 (సుమారు రూ. 89,500)గా నిర్ణయించారు. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,499 (సుమారు రూ. 96,000), టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ ధర CNY 8,499 (సుమారు రూ. 1,09,000)గా ఉంది. ప్రత్యేకంగా విడుదల చేసిన Xiaomi 17 Ultra Leica Edition ధర CNY 7,999 (సుమారు రూ. 1,02,500). ఈ ఫోన్ డిసెంబర్ 27 నుంచి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
Xiaomi 17 Ultraలో 6.9 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 1,060 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పనితీరుకు శక్తినిచ్చేది 3nm ప్రాసెస్‌పై రూపొందించిన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, ఇది గరిష్టంగా 16GB LPDDR5x RAM మరియు 1TB UFS 4.1 స్టోరేజ్‌తో జతకట్టబడింది.
కెమెరా విభాగంలో Xiaomi 17 Ultra ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో Leica ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 1 అంగుళం సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 3.2x నుంచి 4.3x వరకు కంటిన్యూయస్ ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందించారు.
Also Read: Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!
బ్యాటరీ, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6,800mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉండగా, భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తూ, Wi-Fi 7, 5G, Bluetooth 5.4, NFC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది.

