Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీకి రాకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నారన్నారు. అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ అయితే కేంద్రం ఏం చేస్తుంది.. ఎంపీ చామల ఫైర్!
కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వచించలేదా?
వెంటనే కేటీఆర్ ప్రతిపక్ష హోదాను స్వీకరించాలని సూచించారు. అధికార పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వచించలేదా? అని మండిపడ్డారు. ఉద్యమకారుడి అవతారం ఎత్తుకొని జనాలను మోసం చేశారన్నారు. బీఆర్ ఎస్ హయంలో హైదరాబాద్ నిజంగా అభివృద్ధి చెంది ఉంటే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందని గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని వివరించారు. ఇక బీఆర్ ఎస్ హయంలో విచ్చలవిడిగా కబ్జాలు జరిగాయని, వాటిని అడ్డుకునేందుకు హైడ్రాపై విష ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని వెల్లడించారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

