KP Vivekanand: కొండంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనం ప్రారంభమైంది. ప్రభుత్వ శపథాలే పార్టీ పాలిట శాపాలుగా మారనున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద గౌడ్ అన్నారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బిసి, రంగారెడ్డి, కల్వకుర్తి, కొడంగల్ ప్రాజెక్టులపై కేసీఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎస్ఎల్బీసీ పనులు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80- 90% పనులు పూర్తయ్యాయనే దానిపై నోరు మెదపరెన్దుకు, గత రెండేళ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత శాతం పనులు పూర్తయ్యాయో కొడంగల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డికి పాలనలో ఎంత పట్టు ఉందో గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తేనే తెలుస్తుందన్నారు.
Also Read: BRS vs Congress: స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ!.. మళ్లీ కోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!
ప్రజలు వలసల బాట పడుతుంది కనబడటం లేదా?
రియల్ ఎస్టేట్ అనేది ఆదాయాన్ని పెంచుతుంది, తెలంగాణ అభివృద్ధిని పెంచుతుంది అని చెప్పే నీకు తెలంగాణలో గత రెండేళ్ల కాలంలో భూముల రేట్లు ఏ విధంగా పడిపోయాయో తెలీదా…? భూములు కొనే నాథుడే లేడన్నారు. గత రెండేళ్ల కాలంలో పడిపోయిన భూముల రేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు తద్వారా ఆత్మహత్యలకు పాల్పడిన రియల్టర్లు కనిపించడం లేదా? కొడంగల్ ప్రజలు బయటకు వెళ్లి చదువుకోవడం కాదు, బయటి వాళ్ళే కొడంగల్ కు వచ్చి చదువుకునేలా 250 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ ను తయారు చేస్తున్నామని చెప్పే నీకు ఉపాధి లేక, రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజలు వలసల బాట పడుతుంది కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
నువ్వొక్కడివి గెలుస్తావో, లేదో చూసుకో?
2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ కాదు నువ్వొక్కడివి గెలుస్తావో, లేదో చూసుకో? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీకు, నీ పార్టీకి కర్రుకాచి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు.కేసీఆర్ కుటుంబం కాల కూట విషం కాదు, తెలంగాణ ప్రజలకు సంజీవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల పట్ల కాలకూట విషంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి తిరిగి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: KP Vivekananda: కాంగ్రెస్ ట్రాప్‌లో కల్వకుంట్ల కవిత పడిపోయారు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

