Indian Railways
జాతీయం

Indian Railways | రైల్వే శాఖ టార్గెట్ ఫిక్స్… AP, TG కి బెనిఫిట్స్ ఇవే

స్వేచ్ఛ, స్పెషల్ డెస్క్: ఇండియన్ రైల్వే (Indian Railways).. ఇది సామాన్యుడి నేల విమానం. ప్రపంచంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో నాలుగో స్థానంలో ఉంది. రోజూ లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది. తక్కువ ఛార్జీలు ఉండడంతో సామాన్యులకు భారతీయ రైలు పెద్ద వరం. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందిస్తున్నది. ఇప్పుడు దేశం మారుతున్నది. సరికొత్త లక్ష్యాల వైపు ముందుకెళ్తున్నది. దానికి తగినట్టుగానే కేంద్రంలోని మోదీ సర్కార్ రైల్వే శాఖలో అత్యాధునిక హంగులను సమకూర్చుతున్నది. వందే భారత్ రైళ్ల ద్వారా ప్రజల సమయాన్ని వృథా కాకుండా చూసుకుంటోంది. రానున్న రోజుల్లో దేశమంతా వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీనికి రెండు టార్గెట్‌లు పెట్టుకుంది రైల్వేశాఖ.

రెండేళ్లలో 200 రైళ్లు

మూడు రోజుల క్రితం 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకొచ్చింది. రూ.50,65,343 కోట్లతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భారత రైల్వేశాఖ (Indian Railways)కు పెద్దపీట వేశారు. రూ.2.65 లక్షల కోట్లను కేటాయించారు. ఆదాయం రూ.3.02 లక్షల కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేశారు. దేశంలో రైల్వే శాఖలో ఆదాయం ఫుల్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులు చేస్తూ రైల్వే శాఖ ముందుకెళ్తున్నది. అలా వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ నుంచి వారణాసికి మొదటి వందే భారత్ రైలు ప్రయాణించింది. అత్యంత వేగంగా వెళ్లడం, సమయం తక్కువగా ఉండడంతో ఈ రకమైన రైళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నది కేంద్రం. ఇందులోనే పలు మోడళ్లను తీసుకొస్తున్నది. వచ్చే రెండేళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది.

అమృత్, నమో భారత్ రైళ్లకు ముందడుగు

వందే భారత్ తరహాలోనే అమృత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలని రైల్వే శాఖ భావిస్తున్నది. రెండేళ్లలో 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్ల ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నది. 2023 డిసెంబర్ 30న తొలిసారి అమృత్ భారత్ రైలును ప్రారంభించారు. తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకోవడం దీని స్పెషాలిటీ. ఒక్కో రైలుకు 22 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 12 సెకెండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు కాగా, 8 జనరల్ సెకెండ్ క్లాస్, 2 గార్డ్ కంపార్ట్‌మెంట్స్ ఉండేలా రూపొందించారు. దీని గరిష్ట వేగం 130 కిలోమీటర్లు. ఇక, నమో భారత్ రైళ్లను కూడా ఎక్కువగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది రైల్వే శాఖ. పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా ఏర్పాట్లతో నమో భారత్ రూపుదిద్దుకుంది.

నాలుగేళ్లలో లక్ష్యాలు ఎన్నో

వందే భారత్ ప్రాంచైజీలో అత్యాధునిక రైళ్లను దింపుతున్న కేంద్రం, వచ్చే నాలుగైదేళ్లలో రూ.4.6 లక్షల కోట్లతో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్నది. కొత్త లేన్లు, డబ్లింగ్‌తోపాటు కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రద్దీ దృష్ట్యా నాలుగు లేన్ల ఏర్పాటు, అండర్ పాస్‌లు, వంతెనలు, స్టేషన్ల అభివృద్ధి, ఇలా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే వెయ్యి వంతెనలకు అనుమతులు కూడా వచ్చేశాయి. మార్చి నెలాఖరులోగా 14 వందల జనరల్ బోగీలు తయారీ కూడా పూర్తవుతుంది. రవాణా సామర్థ్యంలో మెరుగైన ఫలితాలు సాధించేలా రానున్న నాలుగైదేళ్లలో కీలక ప్రాజెక్టులకు రైల్వే శాఖ ప్లాన్ చేసింది. ఏడాదిలోగా విద్యుదీకరణ వంద శాతం పూర్తయ్యేలా పనులు చకచకా చేస్తున్నది.

తెలంగాణలో కీలక ప్రాజెక్టులు

తెలుగు రాష్ట్రాల నుంచి భారత రైల్వేశాఖ (Indian Railways)కు భారీగానే ఆదాయం లభిస్తున్నది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. తెలంగాణలో కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ, పనుల ఆలస్యంపై క్లారిటీ ఇచ్చింది. కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం జరుగుతోందని తెలిపింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నట్టు స్పష్టం చేసింది. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో 1326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ అమలులో ఉందని ప్రకటించింది. ఇంకో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పింది. దేశమంతా 2026లోపు ఈ టెక్నాలజీ అమలులోకి వస్తుందని తెలిపింది. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో అన్ని రైల్వే లేన్ల విద్యుదీకరణ పూర్తయిందని స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ సంఖ్యను రానున్న రోజుల్లో ఇంకా పెంచాలని రైల్వే శాఖ భావిస్తున్నది.

ఆంధ్రాకు అధిక నిధులు

రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపిస్తున్నది రైల్వే శాఖ. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి తాజాగా రూ.9,417 కోట్లు కేటాయించింది. ఇది గతంలో కంటే 11 రెట్లు ఎక్కువగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రూ.84,559 కోట్ల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కొత్తగా 1560 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. పనులు వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందుస్తున్నది. ఈ విషయాన్ని తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో 8 వందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయని, అన్ని రైళ్లు వంద కిలోమీటర్లకు పైనే వెళ్లేలా ట్రాక్‌లు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. వచ్చే నాలుగైదేళ్లలో దేశమంతా వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

వందే భారత్ రైళ్ల సౌకర్యాలు

  • అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల నిఘా
  • ఎదురెదురుగా రైళ్లు ఢీకొనకుండా కవచ్ సిస్టమ్‌తో ప్రయాణం
  • రీ జెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్
  • సెకన్ల వ్యవధిలోనే అత్యధిక వేగం అందుకునేలా రూపకల్పన
  • సిబ్బంది కోసం ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్
  • ప్రతీ కోచ్‌లో ప్రయాణికుల కోసం అత్యాధునిక టాయిలెట్లు
  • వందే భారత్ రైలు గరిష్టం 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది
  • అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్
  • ప్రతీ కోచ్‌లో ఆటోమేటిక్ డోర్స్
  • జీపీఎస్ ఆధారిత ఆడియో, వీడియో సమాచారం
  • వినోదం కోసం వైఫై, హాట్‌స్పాట్

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు