HMD Pulse 2: గతేడాది విడుదలైన HMD Pulse కు అప్డేట్ వెర్షన్ HMD Pulse 2 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు HMD నుంచి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ లీక్ వివరాలు HMD అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Also Read: Ayurveda Doctors: ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్వేద వైద్యులకు పెద్ద ఊరట.. 58 శస్త్రచికిత్సలకు అధికారిక అనుమతి
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రముఖ టిప్‌స్టర్ HMD_MEME’S (@smashx_60) వెల్లడించిన సమాచారం ప్రకారం, కోడ్‌నేమ్ M-Kopa X3తో అభివృద్ధి చేయబడుతున్న HMD Pulse 2లో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్‌కు 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, వీడియో వ్యూయింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండనుంది.
పనితీరు విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్ పై పని చేయనుందని సమాచారం. దీంతో పాటు 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభించనుండగా, అవసరమైతే 256GB వరకు మైక్రో SD కార్డ్ నుంచి స్టోరేజ్ పెంచుకునే సౌలభ్యం కూడా ఉండనుంది. డైలీ యూజ్ కోసం ఇది సరైన పనితీరును అందించే అవకాశం ఉంది.
కెమెరా విభాగంలో, HMD Pulse 2లో 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారని లీకులు చెబుతున్నాయి. భద్రత కోసం ఫోన్ పక్కన అమర్చిన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండి, 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించనుందని సమాచారం.
కనెక్టివిటీ విషయంలో ఈ ఫోన్ Bluetooth 5.0, NFC వంటి ఫీచర్లను అందించవచ్చని అంచనా. అయితే, ఈ డివైస్ లాంచ్ టైమ్‌లైన్‌పై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఇదే టిప్‌స్టర్ ఇటీవల HMD Pulse 2 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్లను కూడా షేర్ చేయడంతో, Pulse 2 , Pulse 2 Pro మోడళ్లను ఒకేసారి లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూడాల్సి ఉంది.

