Christmas 2025: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందులలో పర్యటించారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ కూడా జగన్ తో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అయితే గత కొంతకాలంగా జగన్ కు దూరంగా ఆమె విదేశాల్లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకే చర్చిలో కలిసి ప్రార్థనలు చేయడం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మరోవైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం జగన్ వెంటే చర్చికి రావడం గమనార్హం. కాగా చర్చిలో ప్రార్థనల అనంతరం పులివెందుల నుంచి తాడేపల్లికి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
షర్మిల.. క్రిస్మస్ పోస్ట్..
క్రిస్మస్ పండుగ పురస్కరించుకోని రాష్ట్రంలోని క్రైస్తవులకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాంకాక్షలు తెలిపారు. ‘విశ్వమానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామాయుడు, ప్రేమమూర్తి క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పర్వదినం మీ జీవితంలో ఆనందం సదా ఉండాలని, మీపై యేసుప్రభువు ఆశీర్వాదం కలగాలని మనస్పూరిగా ప్రార్థిస్తున్నా’ అంటూ ఆమె ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ అవినాష్ రెడ్డి#Christmas2025 #ChristmasEve pic.twitter.com/fjJcK8L9O2
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2025
క్రిస్మస్ శుభాంకాక్షలు: చంద్రబాబు
మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ఎక్స్ వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరం. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోంది. రాష్ట్రంలోని 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గత 12 నెలల గౌరవ వేతనాలను ఒకేసారి ఇస్తూ రూ.51 కోట్లు విడుదల చేశాం. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఇదే నిదర్శనం’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.
Also Read: Telangana Farmers: రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్.. రైతు యాంత్రికరణ పథకం పునః ప్రారంభం!
పవన్ స్పెషల్ పోస్ట్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్రైస్తవులకు క్రిస్మస్ విషెస్ చెప్పారు. ‘క్రైస్తవులు ఆరాధించే జీసస్ జన్మించిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శిలువతో ఉన్న ఒక ఫొటోను సైతం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

