Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు
Ranga Reddy District ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Ranga Reddy District: భూమి ఎవరిది అనేది పక్కకు పెడితే బల నిరూపణతో ఆక్రమించుకోవాలనే లక్ష్యంగానే రియల్​ వ్యాపారం నడుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో భూమి విలువ పెరిగిపోవడంతో నిబంధనలకు అనుగుణంగా రియల్​ వ్యాపారం చేస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో పక్కవాడిపై దౌర్జన్యం చేస్తే అందినకాడికి దండుకోవచ్చు అనే విధంగా జిల్లాలో కొంత మంది రియల్​ వ్యాపారం నడిపిస్తున్నారు.ఫైనాన్షియల్​ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో భూమి భారీగా రెక్కలు రావడంతో గుంట భూమి కూడా విలువైనది. ఆ ప్రాంతంలోని భూ యాజమాన్యులు నేడు రోజువారి కూలీలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వారికి మిగిలిన భూమిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ పరిధితోగానీ, సర్వే నెంబర్లతో సంబంధం లేదు. కానీ ఆ భూమిని ఏలాగైన దక్కించుకోవాలని ఓ రియల్​ ఎస్టేట్​ కంపెనీ రాత్రికి రాత్రి భౌంసర్ల సహాయంతో కబ్జా చేయడం దారుణం.

భూ బాగోతం ఇదీ

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్​ గూడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్​ 300లో నాగుల కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అవసరాల నిమ్మిత్తం 2000 సంవత్సరంలో దాదాపు విక్రయించడం జరిగింది. ఓఆర్​ఆర్​కు సైతం 7 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయం చేసే సందర్భంలో పోలాలకు వెళ్లేందుకు రోడ్డు కోసం వదిలిన 31 గుంటల భూమి ఇప్పటికి మిగిలిపోయిందని భాధితులు వివరిస్తున్నారు. ఈ భూమి పక్కనే నార్సింగ్​ మున్సిపాలిటీకి చెందిన మణికొండ రెవెన్యూకి చెందిన 90 సర్వే నెంబర్​ ఉంది. మణికొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్​ 90లో సైబర్​ సిటీ వెస్ట్ బ్రో కంపెనీ అపార్ట్​మెంట్లు నిర్మాణం చేసింది. ఇందులోని ఫ్లాట్లు విక్రయం జరిగేందుకు సరియైన రోడ్డు మార్గం లేదు. ఆ మార్గం కోసం పుప్పల్ గూడ రెవెన్యూ పరిధిలో ఖాళీగా ఉన్న 300 సర్వే నెంబర్​లోని 31 గుంటల భూమిని కబ్జా చేసుకోని రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరిగింది. 31 గుంటల భూమిపై 49 మంది కుటుంబ సభ్యులు ఆశతో బ్రతుకుతున్నారు. ఈ పేదలను మోసం చేసేందుకు సదురు కాంట్రాక్టర్​ ఆస్ర్తశాస్త్రాలను వినియోగిస్తున్నారు.

Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!

పోలీసులను సైతం లెక్కచేయని వైనం

ప్రభుత్వానికి దగ్గరగా, అధికారులను ప్రభావితం చేయగలిగే వ్యక్తులే కబ్జాలకు పాల్పడుతున్నారనే ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే సైబర్​ సిటీ వేస్ట్​ బ్రో కంపెనీ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన స్థల యజమాన్యంతో రియల్​ ఏస్టేట్ వ్యాపారులు సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని తెలికగా తీసుకోని భూ యజమాన్యులను రియల్​ వ్యాపారులు బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ఆంతర్యాం ఏమీటనే విషయం తెలియడం లేదు. భూ భాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో నార్సింగ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు స్వీకరించినప్పటికి రియల్ వ్యాపారులు లెక్కలేని విధంగా దురుసుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రియల్​ వ్యాపారులు ప్రైవేట్​ సైన్యంతో భాధితులను భయాబ్రాంతులకు గురిచేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలొ నాగుల ప్యామీలి పేరుతో ఉన్న సూచిక బోర్డును సైతం తొలగించి, దౌర్జన్యం చేస్తున్నారు.

Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు