The Rise Of Ashoka: ‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం (Sathish Ninasam) హీరోగా, నిర్మాతగా భారీ స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’ (The Rise Of Ashoka). ఈ సినిమాను వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్ వి ధోండలే దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, రీసెంట్‌గా విడుదలైన పవర్ ఫుల్ సాంగ్ ‘వినరా మాదేవ’ అందరినీ అలరించడమే కాకుండా, సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ విషయానికి వస్తే..
Also Read- Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..
రొమాంటిక్ మెలోడీ సాంగ్..
ప్రేమ జంటను కట్టి పడేసేలా.. ఓ మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ‘ఏదో ఏదో’ అంటూ వచ్చిన ఈ యుగళ గీతాన్ని వింటే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వారి అనుబంధం, కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఈ వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడంతో.. పాటలోని అందమైన లొకేషన్లు, హీరో హీరోయిన్ల పాత్ర తీరుతెన్నులు మొత్తాన్ని చూపించినట్టైంది. ఇందులో సతీష్, సప్తమీ గౌడ జంట చూడముచ్చటగా ఉంది. పాటకు తగినట్లుగా వారి స్టెప్పులు, లుక్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. ఈ పాటకు జయచంద్ర జె.డి. సాహిత్యం అందించగా.. సాయి చరణ్, ఎం.డి. పల్లవి గాత్రం గుండెకు హత్తుకునేలా గాత్రాన్ని అందించారు. పూర్ణచంద్ర తేజస్వీ ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. సంతు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.
Also Read- Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
ఈ పాట విడుదల సందర్భంగా హీరో, నిర్మాత సతీష్ నివాసం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాము. మా ప్రయత్నం కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది. ‘వినరా మాదేవ’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ‘ఏదో ఏదో’ సాంగ్ కూడా అందరినీ అలరిస్తుంది. ప్రేమజంట హాయిగా పాడుకునేలా ఈ పాట ఉంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసి, సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. బి.సురేష్, సంపత్, మైత్రేయ, గోపాల్ కృష్ణ దేశపాండే, యష్ శెట్టి, జగప్ప, రవిశంకర్ (ఆర్ముగ), డ్రాగన్ మంజు వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

