Kodanda Reddy: వ్యవసాయ రంగంలో ఇంకా సంస్కరణలు రావాల్సి ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) స్పష్టం చేశారు. కమిషన్ దృష్టిలో భూమి ఉన్న రైతు, కౌలు రైతు ఇద్దరు సమానమేనని స్పష్టం చేశారు. బి ఆర్ కే భవన్ లోని రైతు కమిషన్ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ కేరళలో కూరగాయల సాగు బాగుందని.. అందుబాటులో ఉందన్నారు.
Also Read: Kodanda Reddy: రైతు కమిషన్‌ను ఆశ్రయించిన రైతులు.. ప్రైవేట్ సీడ్ కంపెనీ మోసంపై ఫిర్యాదు!
రేవంత్ రెడ్డి కూడా హార్టికల్చర్ పెంచాలి
అక్కడి ప్రభుత్వ విధానం రైతులకు అనుగుణంగా ఉందని తెలిపారు. ఊరు వ్యవసాయం కూడా బాగుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హార్టికల్చర్ పెంచాలని భావిస్తున్నారని.. రాష్ట్రంలో ఉద్యానవనం పంటల సాగు పెంచడానికి కావలసిన సరత్తుపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో కూరగాయల సాగు చేసే రైతుల అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని.. రాష్ట్రంలో కూడా కూరగాయల మార్కెట్లు రావాలన్నారు.
20వేల కోట్లు వరకు వ్యవసాయ రంగానికి ఖర్చు
దోపిడి వ్యవస్థ లేని మార్కెట్లు రావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయానికి సంబంధించిన పాలసీలు జరగలేదని గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నెల రోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష 20వేల కోట్లు వరకు వ్యవసాయ రంగానికి ఖర్చు చేసిందని వివరించారు.
Also Read: Kodanda Reddy: పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : గవర్నర్ తో రైతు కమిషన్ భేటి

