Kavitha: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట
Kavitha ( image credit: swetcha reporter)
Political News, నార్త్ తెలంగాణ

Kavitha: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత!

Kavitha: జనం కోసమే జాగృతి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట నిర్వహిస్తున్నట్లు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha)అన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గద్వాలలోని ఓ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టినట్లు అందులో భాగంగా ఈనెల 21, 22 తేదిల్లో గద్వాల జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా ఉన్న నడిగడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండటం ఇక్కడి ప్రజల భాషా తనకు ఎంతో ఇష్టమన్నారు విద్వద్ గద్వాలగా పేరుగాంచిన నడిగడ్డలో సురవరం ప్రతాప్ రెడ్డి ఎందరో కవులు, సాహితివేత్తలకు పాగపుల్లారెడ్డి వంటి ప్రముఖులకు పుట్టినిల్లుగా మారిందని అన్నారు.

గద్వాల పట్టు చీరలు ప్రపంచ ఖ్యాతి

తిరుమల తిరుపతి వెంకన్న బ్రహ్మోత్సవాలకు గద్వాల నుంచే ఏరువాడ జోడు పంచెలు పంపించడం, రాజోలి, గద్వాల పట్టు చీరలు ప్రపంచ ఖ్యాతిని గడించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వలస జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి నోచుకోక ఎలా ఉందో తెలంగాణ వచ్చాక కూడా అభివృద్ది నోచుకోని దుస్థితి ఏర్పడిందని అన్నారు. 2025 సంవత్సరానికి తెలంగాణ వ్యాప్తంగా అక్షర్యాస్యత లో 76 శాతం అర్భన్ ప్రాంతం, రూరల్ గ్రామీణ ప్రాంతంలో 69 శాతం ఉండగా అక్షరాస్యతలో వెనుకడిపోయిందన్నారు. అందులో ఉమ్మడి గట్టు మండలం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. స్వాతంత్ర్య వచ్చి 79 యేండ్లు అవుతున్న నేటికీ గద్వాలలో కుటుంబం పరిపాలన కొనసాగిస్తున్నారని, కుటుంబ పాలనతో విద్య, వైద్యం, ఉపాధి‌ అందక ఈ ప్రాంత ప్రజలు వెనుకబడిపోయారని అన్నారు.

Also Read: Kavitha: జాగృతి పోరాటం వల్లే.. ఐడీపీఎల్ భూముల ఆక్రమణపై విచారణ : కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి

మహబూబ్ నగర్ ఎంపీ‌ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడకి వెళ్లడం పరిపాటిగా మారిందని పార్టీలు మార్చి అధికారం ఛేజిక్కించుకోవడం ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నాసిరకంతో నిర్మించారని, ప్రారంభించడానికి మూడేండ్లు పట్టిందని, వసతులు లేక వైద్యం అందించేందుకు డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో‌ నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు పంపు మోటార్లు ఉంటే ఒక పంపు మోటార్ ఆన్ చేసి కాలువలకు సాగునీరు అందించడంతో పంటపొలాలకు సాగునీరందడం లేదన్నారు. ఆధుని టెక్నాలజీ వాడి పైపు లైన్ ద్వారా సాగు నీరందించాలని కోరారు.

రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి

తుంగభద్రనదీ తీర ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఇసుక దందా నిర్వహిస్తున్నారని, వందలాది టిప్పరల్ ద్వారా అక్రమ ఇసక దందా నడుస్తోందని దీని వల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రజలు అసౌకర్యాన్నికి గురవుతున్నారని, సీఎం రేవంత్ చొరవ తీసుకుని ఇసుక దందాను నిలిపి వేయాలని డిమాండ్ చేసారు.పెద్ద ధన్వాడలో తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టు పక్కల గల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దొంగదారిన ఇథనాల్ ప్యాక్టరీ నిర్మించడానికి. ఫర్మిషన్ ఎవరు ఇచ్చారో వారికి తప్పకుండా ఫనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పచ్చని పంట పొల్లాలతోపాటు నదీజలాలు కలుషితం అవుతాయని, ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేసే వరకు 14 గ్రామాల ప్రజల తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాడుతుందన్నారు. విత్తనపత్తికి కేంద్రబిందువుగా ఉన్న నడిగడ్డలో సీడ్ మాఫియా వల్ల రైతులు అప్పులో కూరుకపోతున్నారని, కంపెన్ని యజమాన్యాలు‌ నేరుగా రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.‌

600 సంవత్సరాలు చరిత్ర

ఆంధ్రఫ్రదేశ్ ప్రభుత్వం తుంగభద్రనదీ మీద కొత్తగా గుండ్రేవుల ఎత్తి పోతల నిర్మించేదుకు సన్నాహాలు చేపడుతుందని దీని వల్ల తెలంగాణలో 24 గ్రామాలు మునిగే అవకాశం ఉందని, తెలంగాణలో ఇంచు భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 600 సంవత్సరాలు చరిత్ర గల మల్దకల్ తిమ్మప్ప ఆలయం అభివృద్ది నోచు కోలేదన్నారు. గద్వాలలో చేనేత కార్మికుల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయని, హ్యాండ్ లూమ్ పార్కు శంకుస్థాపనలకే పరిమితమైందన్నారు. ఇక పేదల కోసం అత్త ఇండ్ల పట్టాలు ఇస్తే అల్లుడు గుంజుకుని నిర్మాణాలు చేపట్టడం ఇదీ ముమ్మాటికి ప్రజలను నమ్మించి వంచించినట్లు అని విమర్శించారు

స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలి

గద్వాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం నేటికి కర్నూల్ ఆసుపత్రికి వెళ్తున్నారని, అక్కడ కర్నూల్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశారని జిల్లా ఆసుపత్రిని ఆదునీకరించి, స్పెషలిస్ట్ వైద్యులను కేటాయించి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియాలని, ఒక వేళ కాంగ్రెస్ లో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి ఆభివృద్ది జరిగేలా ప్రభుత్వం దృష్డికి తీసుకెళ్లి సాధించుకోవాలని, ఒక వేళ బీఆర్ఎస్ లో ఉంటే ప్రతిపక్షం పాత్ర వహించి సమస్యలపై
వెంబండించే సాధించుకునేలా పోరాడాలన్నారు.

అస్తవ్యస్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ

ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు, ర్యాలంపాడు రిజర్వాయర్ లు పూర్తి చేయలేకపోయిందని, లీకేజీల ర్యాలంపాడు రిజర్వాయర్ పూర్తికాక ముందే గట్టు ఎత్తిపోతల పథకం ఎలా పూర్తి చేసి ఎలా సాగునీరు అందిస్తారని ప్రశ్నించారు. మొదలు లేదు.. మోక్షం లేకుండా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నడుస్తోందని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. జూరాల మీద ఆదారపడి‌ ఉన్న అసంపూర్తి 99, 102 ప్యాకేజీలు కాలువలను పూర్తి చేసి సాగునీరందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలలు ఇరిగేషన్ భవనంలో నడపడం హాస్యస్పదంగా ఉందన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డైవర్షన్, కరెప్షన్ పాలసీతో నడుస్తోందన్నారు. పాత , కొత్త ప్రభుత్వాలు గద్వాలలో అభివృద్ది చేయలేకపోయారని మండిపడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జాగృతి పోరాడి సాధించుకునేలా జిల్లాల పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్, బుచ్చిబాబు మరియు జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.. నిధులివ్వరు అంటూ..!

Just In

01

Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

Jupally Krishna Rao: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు