Jagga Reddy: మోదీ ఇచ్చిన హామీలపై నీకు నోరు రాదా..!
Jagga Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

Jagga Reddy: మోదీ ఇచ్చిన హామీలపై నీకు నోరు రాదా.. కిషన్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్..!

Jagga Reddy: సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) తీవ్రంగా మండిపడ్డారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కిషన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ గతంలో ఇచ్చిన హామీలపై కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. బీజేపీకి అవకాశమిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 11 ఏళ్లు గడిచినా మోదీ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని, మోదీపై లేఖ రాశాకే సోనియాను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డికి ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

70 శాతం హామీలు అమలు

తెలంగాణ(Telangana), ఏపీ(AP)లో మోదీ ప్రభావం శూన్యమని, సోనియాను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు వరి పంటకు రూ.500 బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలోనే 70 శాతం హామీలు అమలు చేశామని, ఇచ్చిన 13 హామీల్లో 10 పూర్తి చేశామని వెల్లడించారు. మోదీ హామీలపై చర్చకు కిషన్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ముందు ప్రధానికి లేఖ రాసి సమాధానం రాబట్టాలని, ఆ తర్వాతే సోనియా లేఖపై మాట్లాడాలని జగ్గారెడ్డి హితవు పలికారు.

Also Read: Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

బీజేపీ ఎంపీలకు చివాట్లు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజన్ డాక్యుమెంట్‌పై సోనియా గాంధీ(Sonia Gandhi)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ లెటర్ రాయడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ బీజేపీ ఎంపీలకు చివాట్లు పెట్టారని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితికి కిషన్ రెడ్డే కారణమని ప్రధాని గుర్తించారని పేర్కొన్నారు. ఇప్పుడు కేవలం మోదీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికే కిషన్ రెడ్డి ఇటువంటి లేఖలు రాస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోచుకుంటే కిషన్ రెడ్డి ఎందుకు లెటర్లు రాయలేదని ప్రశ్నించారు.

కేటీఆర్‌ను ఇప్పటికే ఫుట్‌బాల్..

ఐటీ(IT), సీబీఐ(CBI), ఈడీ(ED) సంస్థల ద్వారా కల్వకుంట్ల కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బీజేపీ(BJP)కి తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా కేంద్రం నుంచి నిధులు తెచ్చేవారని చామల ఎద్దేవా చేశారు. కేటీఆర్(KTR) తనను తాను మెస్సీలా భావిస్తూ సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడాలని అనుకుంటున్నారన్నారు. కానీ, రేవంత్ రాజకీయాల్లో కేటీఆర్‌ను ఇప్పటికే ఫుట్‌బాల్ ఆడుకున్నారని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని, స్వయంకృషితో జెడ్పీటీసీ(ZPTC) నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. కేటీఆర్ లాగా అమెరికా నుంచి పారాచూట్‌లో సిరిసిల్లకు రాలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఐరెన్ లెగ్ అని ఆయన సొంత కుటుంబ సభ్యులే మాట్లాడుకుంటున్నారని, ఆయన వల్లే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో కేటీఆర్‌లో ఫ్రస్టేషన్ పెరిగిందని, బీఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని చామల కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Just In

01

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ లింకులు తొలగింపు

Bigg Boss Buzzz: బిగ్ బాస్ బజ్‌లో తన తదుపరి లక్ష్యమేంటో చెప్పేసిన కళ్యాణ్.. ఏంటంటే?

Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!

Pregnant Murder: కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతైన కూతుర్ని చంపేసిన తండ్రి

Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు