Sarpanch Ceremony: నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
Sarpanch Ceremony (imagecredit:twitter)
Telangana News

Sarpanch Ceremony: నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం.. ముస్తాబైన పంచాయతీ ఆఫీసులు

Sarpanch Ceremony: గ్రామాల్లో నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. గత రెండేళ్లుగా అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏక‌గ్రీవ పంచాయ‌తీలు క‌లిపి 12702 పంచాయ‌తీలు, ఉప‌స‌ర్పంచులు, 85,955 వార్డుల్లో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది.

Also Read: MBBS Students: ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ప్రమాణ స్వీకారోత్సవం

రెండేళ్లుగా పల్లెల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలన సాగింది. ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలు వెలువడటంతో గ్రామాలు మళ్లీ ప్రజాప్రతినిధుల పాలనలోకి వెళ్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. నేడు పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. నూతన పాలకవర్గానికి స్వాగతం పలికేందుకు కార్యాలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. షామియానాలు, పూల అలంకరణలతో జీపీలు పెళ్లి పందిళ్లను తలపిస్తున్నాయి. గ్రామస్తులు, గెలిచిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు, అనుచరులతో సందడి నెలకొంది.ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే.. నూతన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం వంటి తక్షణ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఓటే సి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది.

Also Read: Bigg Boss Telugu 9: టెన్షన్ పెట్టిన బిగ్ బాస్.. టాప్ 5గా వెనుదిరిగిన సంజన..

Just In

01

Pawan Sacrifice: ‘హరిహర వీరమల్లు’ సినిమా అంత పని చేసిందా?.. వాటి అప్పులు కట్టడానికి పవన్ ఏం చేశారంటే?

Artificial Intelligence: డాక్టర్లు గుర్తించలేకపోయారు.. Grok AI వల్లనే బతికానంటున్న 49 ఏళ్ల వ్యక్తి

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?