MBBS Students: ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్..!
MBBS Students (imagecredit:twitter)
Telangana News

MBBS Students: ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

MBBS Students: గ్రామీణ ప్రాంతాల నుంచి మెడిసిన్‌లో సీటు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్ విద్యార్థుల్లో లాంగ్వేజ్ స్కిల్స్ కోసం ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్​ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. పేద, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియంలో చదివి సీటు సాధించిన మెడిసిన్ విద్యార్ధులకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. స్పోకెన్ ఇంగ్లిష్​‌తో పాటు విద్యార్థుల్లో ఆత్మ న్యూనత భావనను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. దీని వలన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఇక దేశవ్యాప్తంగా మెడికోలు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయని, ఇలాంటివి మన రాష్ట్రంలో జరగకుండా పటిష్ట్రం చేయనున్నారు.

ఈ నిర్ణయం ఎందుకు..?

పేద, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధులు ఇంగ్లిష్ భాష వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో వారికి పాఠాలు అర్థం కాకపోవడంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నట్లు ప్రభుత్వం ఇటీవల తన స్టడీలో గుర్తించింది. అంతేగాక తోటి పిల్లలతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నట్లు అంచనా వేశారు. దీని వలన ఆత్మన్యూనత భావంతో విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆయా విద్యార్థుల్లో మంచి ట్యాలెంట్ ఉన్నప్పటికీ, కేవలం భాష పరమైన ఇబ్బందులతో మెడికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోకపోవడం వల్ల, ఒత్తిడి వల్ల ఫెయిల్ అవడం వంటివి జరుగుతున్నాయి. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ బాధల నుంచి విద్యార్థులను రక్షించేందుకు వారికి స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణను ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి అధికారులకు సూచించారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు ఇంగ్లిష్ క్లాసులు చెప్పించాలని, ఇందుకు అవసరమైన టీచర్లను నియమించాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇంగ్లిష్, జపనీస్, జర్మనీ భాషల్లో శిక్షణను ఇప్పిస్తున్న సర్కార్.. ఇప్పుడు ఎంబీబీఎస్ విద్యార్ధుల స్కిల్స్ పెంపు కోసం కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read: Telangana BJP: మోదీ చివాట్లతో బీజేపీ నేతల్లో మార్పు.. డిన్నర్ మీటింగ్ వెనుక రహస్యం అదేనా?

ప్రైవేట్ కాలేజీలపై కూడా ఫోకస్ ?

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల నుంచి వచ్చే మెరిట్ విద్యార్థులు ఈ సీట్లను సాధిస్తున్నారు. ఆయా విద్యార్ధుల కాలేజీ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. కానీ, హాస్టల్, మెస్, బుక్స్‌, లైబ్రరీ తదితర అవసరాల కోసం కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు కూడా ఏటా లక్షల రూపాయల ఖర్చు వస్తున్నది. కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల పేద, మధ్య తరగతి మెడిసిన్ విద్యార్ధులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి చదువులపైన కూడా ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన సహాయం చేయడం ఎలా? అనే అంశాలను స్టడీ చేసి, రిపోర్ట్ ఇవ్వాలని హెల్త్ సెక్రెటరీ, హెల్త్ యూనివర్సిటీ వీసీని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

డిజిటల్ క్లాస్ రూమ్స్.. రీసెర్చ్ సెంటర్లు

మన రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. వీటితో కలిపి మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 35కు చేరింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 26గా ఉంది. సుమారు 9 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన పిల్లలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఎస్సీ వర్గీకరణతో ఇంతకుముందు ఎన్నడూ పెద్దగా ఎంబీబీఎస్ సీట్లు సాధించని, పేద వర్గాల పిల్లలకు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. అయితే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్‌, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్‌, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

Also Read: Ma Vande: షూటింగ్ ప్రారంభమైన మోదీ బయోపిక్ ‘మా వందే‘.. ఇది ఒక చారిత్రక దృశ్యం..

Just In

01

KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Meera Raj: హాట్ టాపిక్‌గా ‘స‌న్ ఆఫ్’ బ్యూటీ.. ‘కాంచ‌న 4’లో ఛాన్స్!

Medical Mafia: అర్హత లేకుండా ఖరీదైన వైద్యం.. మిర్యాలగూడలో మెడికల్ మాఫియా

Demon Pavan Bigg Boss: రూ. 15 లక్షలతో వెనుదిరిగిన డిమాన్ పవన్!

Lionel Messi Payment: భారత్‌లో పర్యటించినందుకు మెస్సీ పేమెంట్ ఎంతో తెలుసా?