CM Revanth Reddy: కేసీఆర్ హయంలోనే అత్యధిక జల దోపిడి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేయడం వలన మూడు జిల్లాలకు కేసీఆర్ మరణ శాసనం రాశారన్నారు. పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డి(Harshavardhan Reddy)కి బీ ఫామ్ ఇచ్చింది కేసీఆరే అని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని గుర్తు చేశారు. కానీ కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసిఆర్(KCR) లిఫ్టులు కట్టారని మండిపడ్డారు. జలాలు నిజాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాను సిద్ధమని, జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదన్నారు. ఇక చంద్రబాబు(Chandrababu)అసలు శిష్యుడే కేసీఆరే నంటూ వివరించారు. గతంలో పట్టిసీమను అభినందిస్తున్నానని కేసీఆర్ పొగడ్తలు కురిపించారని సీఎం గుర్తు చేశారు. ఇక కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చారని స్పష్టం చేశారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే కేసీఆర్ ముఖం చాటేస్తున్నాడన్నారు. కుర్చీ కోసం అల్లుడు, కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారన్నారు. కానీ కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిజనిర్ధారణ కమిటీ వేసి, ఫలితాలను విశ్లేషిస్తామన్నారు.
తెలంగాణ ప్రజలకు మరణ శాసనం
రాష్ట్రాన్ని అతలకు కుతలం చేసి దివాళ తీయించింది కేసీఆర్ అని మండిపడ్డారు. పదేళ్లలో కృష్ణ మీద కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలేదన్నారు. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసీఆర్ వేలకోట్ల కమిషన్లు దండుకున్నాడన్నారు. 10 ఏళ్లలో కృష్ణా నదిపై రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి లక్ష 80 కోట్ల బిల్లులు చెల్లించారని వివరించారు. ఏపీ జలదోపిడికి దోహదం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. జూరాల దగ్గర ఓడిసి పట్టుకోవాల్సిన కృష్ణ జిల్లాలను శ్రీశైలం నుండి ఇచ్చి ఏపీకి రాసిచ్చిండన్నారు. 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీల తో తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిండన్నారు. రెండేళ్ల తర్వాత కలుగులో నుంచి కేసీఆర్ బయటకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు.
Also Read: BJP Vs Congress: భగవద్గీత నమ్మే గాంధీపై వివక్షా?.. బీజేపీకి కాంగ్రెస్ నేత ప్రశ్న
పంపిణీలో టెక్నాలజీ వద్దా?
మరోవైపు ఓటమితో కేసీఆర్ మారతారని ఆశించానని, కానీ మళ్లీ అబద్ధాలే చెప్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాలపై అసెంబ్లీలో చెబుతానని వివరించారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం చాలని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్ అంటూ క్లారిటీ ఇచ్చారు. యూరియా పంపిణీలో టెక్నాలజీ వద్దా? యాప్ పెడితే నష్టమేంటి? అంటూ సీఎం ప్రశ్నించారు. కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆరే అంటూ క్లారిటీ ఇచ్చారు. చెక్‌డ్యామ్‌లపై బాంబులు పెడితే సమాచారం ఇవ్వాలని సీఎం కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ కూడా సరిగ్గా సమర్పించ లేదన్నారు. ఇంకా ప్రజలను మోసం చేయడానికి కేసిఆర్ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది..
కేసీఆర్ ఆర్ధిక ఉగ్రవాది అంటూ సీఎం విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారన్నారు. నాలుగు రకాలుగా ఎనిమిది లక్షల అప్పులు చేశారన్నారు. దాన్ని తమ ప్రభుత్వం సరి చేస్తుందన్నారు. మోడీ(Modhi) ఎరువు పంపించగానే కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చారన్నారు. కాళేశ్వరం(kaleshwaram)పై విచారణకు సీబీఐ(CBI)కు అనుమతి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అరవింద్ కుమార్(Aravind Kumar) పై విచారణకు డిఓ పిటి(DOPT) నుంచి అనుమతి ఎందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది కేటీఆర్(KTR) ,హరీష్ రావు(Harish Rao)లేనని చెప్పారు. సీఎంగా ప్రమాణస్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నారన్నారు. కేసీఆర్ పోయిన తర్వాత తన దారి తనదేనని హరీష్ రావు చెప్పకనే చెప్పిండన్నారు. కేటీఆర్ ఐరన్ లెగ్ అని తేలిపోయిందన్నారు. అందుకే పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలనే వాదనలు బీఆర్ఎస్ లో స్టార్ట్ అయ్యాయన్నారు. పార్టీని హస్తగతం చేసుకుంటే రూ.5300 కోట్ల పార్టీ ఆస్తులు తనకు దక్కుతాయని హరీష్ రావు చూస్తున్నారన్నారు.
Also Read: Medical Mafia: అర్హత లేకుండా ఖరీదైన వైద్యం.. మిర్యాలగూడలో మెడికల్ మాఫియా

