Bigg Boss Grand Finale: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ డే (Bigg Boss Telugu Season 9 Grand Finale) వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి మొదలు కాబోతోంది. ఈ లోపు ఈ ఫినాలే ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి చిన్న ప్రోమో వదిలారు. ఈ ప్రోమో చూస్తే.. గ్రాండ్ ఫినాలేను మాములుగా ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. కింగ్ నాగార్జున ‘కూలీ’ (Nagarjun Coolie) సినిమాలోని సైమన్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ అలరించారు. ఇక ఈ సీజన్ 9లోని మొత్తం కంటెస్టెంట్స్ అందరూ సందడి చేస్తున్నారు. వారందరినీ మరోసారి చూడటం అనేది బిగ్ బాస్ వీక్షకులకు కన్నుల పండగే అని చెప్పుకోవచ్చు. ఇక డైరెక్ట్‌గా విన్నర్ గేమ్‌కి వెళ్లకుండా ఎప్పటిలానే స్టార్ సెలబ్రిటీలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. ‘ఛాంపియన్’ మూవీ టీమ్, ‘అనగనగా ఒక రాజు’ టీమ్ సెట్‌లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. అలా గ్లామర్ గాళ్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్ దద్దరిల్లిపోయింది.
టాప్ 5 నుంచి సంజన ఔట్
అంతేకాదు, ఈసారి విన్నర్‌ని నిర్ణయించే క్రమంలో రోబోతో కూడా కాసేపు ఎంటర్‌టైన్ చేశారు. డింపుల్ హయాతి, పాయల్ రాజ్‌ఫుత్, మంగ్లీ, అనస్వర రాజన్, మీనాక్షి దీక్షిత్, శ్రీదేవి వంటి వారంతా ఈ స్టేజ్‌పై కనిపించి, ఈ ఫినాలేకు మరింత గ్లామర్ అద్దారు. ఈ ప్రోమోలో చిన్న హింట్ కూడా ఇచ్చారు అదేంటంటే.. టాప్ 5 నుంచి మొదట సంజన ఎలిమినేట్ అయినట్లుగా ప్రోమో మొత్తం చూస్తుంటే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ ఫినాలేలో శ్రీకాంత్ (Srikanth)ను కూడా ఇన్వాల్వ్ చేసి, అతనితోనే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేయించారు. ఇక హౌస్‌లో ఉన్న 5గురితో నాగార్జున ఆడించిన ఆటలు కూడా ప్రేక్షకులకు కిక్ ఇచ్చాయి. బిగ్ బాస్ ట్రోఫీని చూపించి, ఇది ఈసారి ఎవరు తీసుకోబోతున్నారు? అని ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అభిప్రాయాన్ని అడగగా, వారు తలొకరి పేరు చెప్పారు.
కంట్రీలోనే నెంబర్ వన్
బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసి కంట్రీలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నట్లుగా కింగ్ నాగార్జున (King Nagarjuna) ప్రకటించారు. అలాగే ఇంట్లో ఉన్న వారిలో ఎవరికి థ్యాంక్యూ చెప్పాలని అనుకుంటున్నావో.. వారికి బ్రెస్‌లెట్ వేసేసి థ్యాంక్యూ చెప్పమని నాగ్ హౌస్‌మేట్స్‌ని కోరగా.. కళ్యాణ్ వచ్చేసి తనూజకు థ్యాంక్యూ చెప్పాడు. పవన్ కూడా తనూజకే థ్యాంక్యూ చెప్పాడు. రీతూకి పవన్ సారీ చెప్పాడు. తర్వాత హౌస్‌లోకి శ్రీకాంత్ ఎంట్రీతో కాసేపు నవ్వులు పూయించారు. స్టేజ్‌పైకి బీబీ జోడి జడ్జిలతో నాగ్ ముచ్చటిస్తూ, పంచులు పేల్చారు. అలా సరదాగా నడిచిపోతున్న ఈ ప్రోమోలో చివరికి కింగ్ నాగ్.. ‘ఈ యుద్ధభూమిలో ఆ ట్రోఫీ ఎవరి సొంతం కాబోతుందో.. రాత్రికి చూద్దాం. ఈ రాత్రి నిర్ణయిస్తుంది సరికొత్త విన్నర్‌ని. ఒక కొత్త చరిత్రని’ అంటూ.. ఈ ఫినాలేపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

