Brahmani Birthday: హీరో నిఖిల్‌తో క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి
Nara-Brahmani (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి

Brahmani Birthday: ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆదివారం (డిసెంబర్ 21) పుట్టినరోజు (Brahmani Birthday) జరుకుంటున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా గడిపే ఆమె ఇవాళ జాలీగా గడిపారు. మంగళగిరిలో ఎంపీఎల్-4 క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవాళ్టి మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. అయితే, క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి హీరో నిఖిల్ కూడా హాజరవ్వగా, ఆయనతో కలిసి బ్రాహ్మణి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకొని సరదాగా కొన్ని బంతులాడారు. బ్రాహ్మణి క్రికెట్ ఆడడం అక్కడున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. చప్పుట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.

లోకేష్ బర్త్‌డే పురష్కరించుకొని..

ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే నెల జనవరి 23న పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే, జన్మదినాన్ని పురష్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 21 వరకు టోర్నమెంట్ జరగనుంది. ఇందులో 125 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి నారా బ్రాహ్మణితో పాటు ఎంపీ సానా సతీష్, హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ కూడా పాల్గొన్నారు. ఇవాళ్టి మ్యాచ్ ప్రారంభానికి ముందు, మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ అందరినీ ఆకట్టుకుంది.

Read Also- Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

బ్రాహ్మణికి లోకేష్ విషెస్

పుట్టినరోజు నాడు తన సతీమణి నారా బ్రాహ్మణికి మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బ్రాహ్మణి. కష్ట, సుఖాలు, ప్రశాంతత, గందరగోళం ఎలాంటి సమయంలోనైనా నువ్వు ఒకేలా ఉంటున్నావు. దేవాన్ష్‌కు ఒక తల్లిగా, రాక్‌స్టార్ సీఈవోగా, ఇక, నాతో కలిసి నడుస్తున్నావు. ఎప్పటికీ కృతజ్ఞుడిని’’ అని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.

Read Also- Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ

Just In

01

Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Meera Raj: హాట్ టాపిక్‌గా ‘స‌న్ ఆఫ్’ బ్యూటీ.. ‘కాంచ‌న 4’లో ఛాన్స్!

Medical Mafia: అర్హత లేకుండా ఖరీదైన వైద్యం.. మిర్యాలగూడలో మెడికల్ మాఫియా

Demon Pavan Bigg Boss: రూ. 15 లక్షలతో వెనుదిరిగిన డిమాన్ పవన్!