Harish Rao: రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తానే జిల్లా నుంచి మంత్రిగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ శనివారం అందోలులో నిర్వహించారు. అందోలులో కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్పాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఎస్పీ బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు చేస్తే యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు రూ.25వేలు పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: Kotak Bank Downtime: కోటక్ ఖాతాదారులకు కీలక అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పనిచేయవు.. ఎప్పుడంటే?
ప్రభుత్వం నిర్లక్ష్యం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అందోలు నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు సేద్యానికి నీరు ఇచ్చామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఇరిగేషన్ పథకం పనులను చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో 75 సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం చాలా సంతోషకరమన్నారు. కేంద్రం మంజూరు చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచ్‌ల ఖాతాలోకి వెళ్తాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా చెక్ పవర్ ఉండదని, రాష్ట్రపతికి, సర్పంచ్‌కు మాత్రమే చెక్ పవర్ ఉంటుందన్నారు. చక్కగా పనిచేయాలని, ఎన్నికల సమయంలో ఎలాగైతే ఓటర్లతో ప్రేమగా ఉన్నామో అలాగే ఉండాలన్నారు.
Also Read: SHE Teams: షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్

