Minister Ponguleti: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో!
Minister Ponguleti (imagecredit:twitter)
Telangana News

Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డు(Accreditation card)ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Sonia Gandhi: గాంధీ పేరు మార్పు.. తొలిసారి పెదవి విప్పిన సోనియా.. ప్రధానికి సూటి ప్రశ్నలు

ఇళ్ల స్థలాల విషయంలో

గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని, అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించు కోవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను ఆయన అభినందించారు.

Also Read: Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. కానీ!

Just In

01

Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Bigg Boss Grand Finale: ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాములుగా ఉండదు.. ప్రోమో వచ్చేసింది!

KCR BRS LP: రాబోయేది మనమే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. సాయంత్రం 6 గంటలకు ప్రెస్‌మీట్

MBBS Students: ప్రైవేట్ కాలేజీల దోపిడీకి చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి