Ponnam Prabhakar: జాతీయ రహదారి మాసోత్సవాలపై సమీక్ష!
Ponnam Prabhakar (imagecredit:swetcha)
Telangana News

Ponnam Prabhakar: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై మంత్రి సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!

Ponnam Prabhakar: రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు-2026 పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ ఎం భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం శనివారం నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేవారని, గత ఏడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని తెలిపారు.

నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ సిద్దం

రాష్ట్రంలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 20 మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. గత ఏడాది 7,949 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల పై ఈ నెల ఆఖరులోగా జిల్లా స్థాయిలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించాలని, కార్యక్రమం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. నేషనల్ హై వే, ఆర్ అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రత మాసోత్సవాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని, నెల రోజులపాటు ట్రాఫిక్ వాలంటీర్లను నియమించాలని సూచించారు. అనంతరం వారిని అభినందిస్తూ సర్టిఫికెట్ అందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని, రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం ఇస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

Also Read: Villages Development: పల్లెల అభివృద్ధి ఎవరి చేతుల్లో? గ్రామాభివృద్ధిపై నూతన పాలకవర్గాల ఫోకస్!

అవగాహన సదస్సులు నిర్వహిస్తాం..

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లాలోని రహదారి భద్రతపై అవగాహన సదస్సులు 9 సార్లు నిర్హహించామని,ఇంకా నిర్వహిస్తామని కలెక్టర్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ఆయా విద్య సంస్థల్లో విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ ఇతర పోటీలు చేపడుతామని పేర్కొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని వివరించారు. నేషనల్ హై వే, ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, బ్లాక్ స్పాట్లు గుర్తిస్తామని, వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఏఎస్పీ మహేందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీరామ్, ఆర్ టి సి డిపో మేనేజర్.. ట్రాఫిక్ పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి, సిద్దిపేట, జిల్లాల్లోని కలెక్టర్ ప్రావీణ్య, హైమావతిలు సహితం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Also Read: Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

Just In

01

Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క

SHE Teams: షీ టీమ్స్​ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్