Kishan Reddy: టీడీపీపై కిషన్ రెడ్డి ఫైర్.. ఏపీలో తీవ్ర ప్రకంపనలు!
Kishan Reddy (Image Source: Twitter)
Telangana News

Kishan Reddy: టీడీపీపై కిషన్ రెడ్డి ఫైర్.. కూటమిలో తీవ్ర ప్రకంపనలు.. మోదీని చిక్కుల్లో పడేశారా?

Kishan Reddy: తెలంగాణ రాజకీయాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సెగలు రేపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గతంలో తెలుగుదేశం, బీఆర్ఎస్ పాలనలు ఎలా సాగాయో.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కూడా అలాగే సాగుతోందని ఆ పార్టీలు అనుసరించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ ఫాలో అవుతోందని, ఈ పార్టీలన్నీ ఒకటేనన్నట్లుగా ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఏపీలో కూటమి బంధంపై నీలినీడలు

కిషన్ రెడ్డి చేసిన విమర్శలు అటు కూటమి రాజకీయాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి. అటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది. ఏపీలో అన్యోన్యంగా సాగుతున్న ఈ బంధంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఒకవైపు ఏపీలో పొత్తులో ఉంటూనే, మరోవైపు తెలంగాణలో టీడీపీ పాలనను ఫెయిల్యూర్ మోడల్‌గా చిత్రించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తున్నారా?

కిషన్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. కిషన్ రెడ్డి కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో టీడీపీ పుంజుకుంటే తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే భయంతోనే కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేదా కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీలను ఒకే గాటన కట్టడం ద్వారా తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

తెలంగాణలో టీడీపీకి దూరంగా బీజేపీ

తెలంగాణ బీజేపీ నేతలు మొదటి నుంచి రాష్ట్రంలో టీడీపీని దూరంగా పెడుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ, కిషన్ రెడ్డి పాత విభేదాలను గుర్తుచేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం కేడర్‌లో గందరగోళానికి దారితీసింది. కిషన్ రెడ్డి చేసిన విమర్శల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య దూరం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వ్యూహమా? తప్పిదమా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో, కిషన్ రెడ్డి గత పాలకులందరినీ ఒకే గాటన కట్టే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో టీడీపీ పేరును ప్రస్తావించడం వ్యూహాత్మక తప్పిదమా? లేక తెలంగాణలో టీడీపీ పుంజుకోకుండా చేసే ప్రయత్నమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పాలన విధానం తప్పైతే.. ఏపీలో ఆ పార్టీతో పొత్తు దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అవినీతి విషయంలో బీఆర్ఎస్‌తో టీడీపీని పోల్చడం ద్వారా కిషన్ రెడ్డి కూటమి ధర్మాన్ని విస్మరించారా అన్న చర్చ నడుస్తోంది.

Also Read: Ambati Rambabu: మేము పీకలేకపోయాం.. మీరు వచ్చి పీకండి.. పవన్‌కి అంబటి చురకలు!

టీడీపీ ఎలా స్పందిస్తుందో

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. అయితే, అదే స్థాయిలో గత టీడీపీ పాలనను కూడా పోల్చడం ద్వారా కిషన్ రెడ్డి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? టీడీపీ పాలన అంత దారుణంగా ఉంటే ఏపీలో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ బీజేపీ-టీడీపీ మైత్రిపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీని సైతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చిక్కుల్లో పడేశాయా అన్న సందేహాలు రాజకీయంగా వ్యక్తమవుతున్నాయి.

Also Read: Sonia Gandhi: గాంధీ పేరు మార్పు.. తొలిసారి పెదవి విప్పిన సోనియా.. ప్రధానికి సూటి ప్రశ్నలు

Just In

01

Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క

SHE Teams: షీ టీమ్స్​ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్