BRS Party: పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ కి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ ఆశించిన స్థాయిలో గ్రామపంచాయతీ కైవసం చేసుకున్నామని పార్టీ పేర్కొంటుంది. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల( ఎంపీటీసీ, జడ్పిటిసి) ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికల రూపొందిస్తుంది. అందులో భాగంగానే పార్టీ నేతలు ఉత్సాహం తోపాటు గెలిచిన సర్పంచ్ను పార్టీ మారకుండా వారిలో భరోసా కల్పించేందుకు జిల్లాల పర్యటనలకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. పార్టీ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు పర్యటన చేయాలని పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పార్టీ కేడర్లో భరోసా నింపేందుకు గులాబి అధిష్టానం సిద్ధమైంది. పార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా.. గ్రామస్థాయిలో పార్టీ బలహీనంగా కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ముమ్మర ప్రచారం చేయాలని ఇప్పటికే భావిస్తుంది.
పార్టీ పటిష్టతకు సర్పంచ్ ఎన్నికల విజయమే
అందులో భాగంగానే గెలిచిన సర్పంచ్లను సన్మాన కార్యక్రమాన్ని చేపడుతుంది. వారికి పార్టీ అండగా ఉంటుందని రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని వారిలో ధైర్యం కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగానే జిల్లాలో గెలిచిన సర్పంచ్లను ఆయా జిల్లా కేంద్రంలోని సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికీ భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు సర్పంచ్ ఎన్నికల విజయమే నిదర్శనమని… కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీపై వ్యతిరేకత ప్రజల్లో ఉందని ఈ ఎన్నికల స్పష్టం చేశాయని సగం సీట్లను గులాబీ కైలాసం చేస్తుందని రాబోయేది గులాబీ పార్టీ అని మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని నేతలు పేర్కొంటున్నారు.
Also Read: BRS Party: బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి.. ఆర్థికంగా బలంగా ఉన్నవారికే టికెట్!
స్థానిక సంస్థల ప్రతినిధులే కీలకం
ప్రతి మీటింగ్లో ను పార్టీ కీలక నేతలైన కేటీఆర్ హరీష్ రావుల సైతం ఇదే అంశాన్ని వివరిస్తున్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సహితం.. గ్రామాల కీలకం. అందులో కీలక భూమికి పోషించేది ఇప్పుడు గెలిచిన సర్పంచ్ లే. ఆ ఎన్నికల ముందు గెలిచిన సర్పంచులు అధికార పార్టీలకు చేరకుండా ఉండేందుకు.. వారిని కట్టడి చేసేందుకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులే కీలకం కావడం తో వారిని పార్టీలోనే ఉండాలని.. ‘చేతి’కి చిక్కకుండా కాపాడుకోవాలని గులాబి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే నేతల జిల్లాల పర్యటననేతల జిల్లాల పర్యటనకు శ్రీకారం పార్టీ చుట్టిందని విశ్వాసనీయ సమాచార.
గెలుపును విస్తృతంగా మీడియా ద్వారా విస్తృత ప్రచారం
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో హరీష్ రావు, కేటీఆర్ పర్యటించనున్నారు. పంచాయతీ గెలుపును విస్తృతంగా మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని… సోషల్ మీడియాలో సైతం జిల్లాలో మండలాల వారీగా లెక్కలను టిఆర్ఎస్కు వచ్చిన అంకెలవారీగా వివరించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. పార్టీ కీలక నేతలు ఇద్దరు కావడంతో.. వారి పర్యటనలతో పార్టీకి బూస్ట్ తీసుకొచ్చేందుకు.. ఈ జిల్లాల పర్యటన చేవటబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
40% సీట్లకు పైగా కైవసం
పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోయినా గులాబీ పార్టీ సుమారు 40% సీట్లకు పైగా కైవసం చేసుకుందని.. అందుకే ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లి ఆకట్టుకోవాలని.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని భావించే జిల్లా వారీగా పర్యటనలు చేసి కేడర్లో నాయకుల్లో ధైర్యం కల్పించాలని పార్టీ భావిస్తుంది. అదేవిధంగా పార్టీ క్యాడర్ పై అధికార కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగిన కేసులు పెట్టిన బెదిరింపు చేసిన వారిని లీగల్గా ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో లీగల్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కేసులను పార్టీని వాదిస్తుందని.. పార్టీ కేడర్ కు భరోసాగా నిలుస్తుందని అభయమించారు. అయితే పార్టీ కేడర్లో జిల్లాల పర్యటనలు ఏ మేరకు భరోసా ఇస్తుందనేది చూడాలి.
Also Read: BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్

