Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు జరగలేదని చెప్పడం విచారకరం
Kishan ReddyN( image credit: swetcha reporter)
Political News

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు జరగలేదని చెప్పడం విచారకరం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: రాష్ట్రానికి విద్యుత్ సంబంధిత అంశంలో అన్ని రకాల సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ తెలంగాణలో విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.వేలకోట్ల అప్పుల భారాన్ని విద్యుత్ సంస్థలు మోయలేక.. వాటి నడ్డి విరుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల దయనీయ పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల శ్వేతపత్రాన్ని విడుదల చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ విద్యుత్ విభాగాలు, డిస్కంలు చెల్లించాల్సిన అప్పు రూ.30వేల కోట్లకు పైగా ఉందని చెప్పారన్నారు. ఒక్క సింగరేణి సంస్థకే దాదాపు రూ.47వేల కోట్లు విద్యుత్ సంస్థలు బాకీ పడ్డాయన్నారు.

విద్యుత్ ప్రాజెక్టులు ముందుకు పడటం లేదు

రాష్ట్రంలో ఒక్క పూట వర్షం వస్తే హైదరాబాద్ తో సహా అంతలా కరెంట్ కట్ అవుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు కనీస సహకారం కూడా అందించడం లేదని విమర్శించారు. గత బడ్జెట్ లో రూ.21వేల కోట్లను మాత్రమే విద్యుత్ రంగానికి కేటాయించారని, మరి పాత బకాయిల సంగతేంటో తెలియడం లేదన్నారు. నిధుల లేమి కారణంగా వివిధ విద్యుత్ ప్రాజెక్టులు ముందుకు పడటం లేదన్నారు. ఇటీవల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. తెలంగాణలో థర్డ్ డిస్కను ఏర్పాటుచేసి దాని ద్వారా.. ఉచిత పథకాలకు విద్యుత్ ఇస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి దీని పేరుతో మరిన్ని అప్పులు తీసుకోవడం తప్పా సర్కార్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు.

Also Read: Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

2400 మెగావాట్ల విద్యుత్

జెన్కోకు ఉన్న రూ.26 వేల కోట్ల బకాయిలను, మరో రూ.9 వేల కోట్ల ప్రతిపాదిత రుణాలను.. కొత్త డిస్కంకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.47 వేల కోట్ల బకాయిలు సింగరేణికి చెల్లించని కారణంగా.. ఆ సంస్థ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కు నిధులు సమకూర్చలేకపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం పనిచేస్తోందని, ఇప్పటికే 1600 మెగావాట్ల పనులు పూర్తయిందన్నారు. కానీ మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడం లేదన్నారు. అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో విద్యుదుత్పత్తి చేస్తే.. దాని భారం మళ్లీ తెలంగాణ ప్రజలపై పడుతుందన్నారు.

కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం

పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్ణయంపై కిషన్ రెడ్డి స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేశారని, ఆధారాలున్నా వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులో పట్టుకుని తిరగడం కాదని, ఏవిధంగా అవమానిస్తున్నారో చూసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని, ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని సర్దిచెప్పుకున్నారు.

Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!