Google Meet Update: మీటింగ్‌లో వాయిస్ కట్ సమస్యకు చెక్..
Google ( Image Source: Twitter)
Technology News

Google Meet Update: మీటింగ్‌లో వాయిస్ కట్ సమస్యకు చెక్.. గూగుల్ మీట్ కొత్త అప్‌డేట్

Google Meet Update: వర్చువల్ మీటింగ్స్‌లో ప్రెజెంటేషన్లు ఇచ్చే యూజర్లకు పెద్ద ఊరటనిచ్చేలా Google Meet తాజాగా కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు చాలా మందిని ఇబ్బంది పెట్టిన లిమిటెడ్ ఆడియో షేరింగ్ సమస్యకు ఈ అప్‌డేట్‌తో పరిష్కారం లభించింది. ఇకపై మీటింగ్స్ సమయంలో కేవలం ఒక బ్రౌజర్ ట్యాబ్ ఆడియోకే పరిమితం కాకుండా, పూర్తి సిస్టమ్ ఆడియోను షేర్ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

Also Read: PM Ujjwala Yojana: రేషన్ కార్డు వచ్చిన వారికి గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇలా తీసుకోండి..!

ఇంతవరకు Google Meet‌లో ప్రెజెంట్ చేసే సమయంలో, ఆడియో షేరింగ్ కేవలం ఒక Chrome ట్యాబ్‌కే పరిమితంగా ఉండేది. అంటే వీడియోలు, డెమోలు లేదా ఇతర యాప్స్‌లో ప్లే అయ్యే సౌండ్‌ను మీటింగ్‌లో ఉన్నవారు వినలేకపోయేవారు. ఈ పరిమితి ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసులు, ట్రైనింగ్ సెషన్లలో పెద్ద గందరగోళానికి కారణమయ్యేది.

కొత్త అప్‌డేట్‌లో మార్పులు ఏంటి?

తాజా అప్‌డేట్‌తో Google Meet యూజర్లు ఇప్పుడు పూర్తి సిస్టమ్ ఆడియోను షేర్ చేయగలరు. ప్రెజెంటేషన్ ప్రారంభించే సమయంలో “Present” ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, కొత్తగా “Also share system audio” అనే టాగుల్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేస్తే, డివైస్‌లో ప్లే అయ్యే అన్ని సౌండ్స్ — వీడియోలు, మ్యూజిక్, యాప్స్ ఆడియో — మీటింగ్‌లో పాల్గొన్నవారికి వినిపిస్తాయి.

Also Read: Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో 69 రోజులు బ్లాక్‌మెయిల్.. కాన్పూర్ దంపతులకు రూ.53 లక్షల నష్టం!

సిస్టమ్ ఆడియో షేరింగ్ ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్‌ను విండో ప్రెజెంటేషన్ లేదా ఫుల్ స్క్రీన్ ప్రెజెంటేషన్ రెండింట్లోనూ ఉపయోగించవచ్చు. ఒక్కసారి టాగుల్ ఆన్ చేస్తే, డివైస్‌లోని మొత్తం ఆడియో అవుట్‌పుట్‌ను Google Meet క్యాప్చర్ చేస్తుంది. అయితే, ఈ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి సారి ప్రెజెంట్ చేసే ముందు యూజర్లు దీన్ని మాన్యువల్‌గా ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న స్టెప్ మర్చిపోతే, మళ్లీ ఆడియో షేర్ కాకపోయే అవకాశం ఉందని గూగుల్ సూచిస్తోంది.

Also Read: Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి

ఏ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉంది?

ప్రస్తుతం ఈ సిస్టమ్ ఆడియో షేరింగ్ ఫీచర్ macOS 14.02 లేదా అంతకంటే కొత్త వెర్షన్ Windows 11 డివైసులు లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు, యూజర్లు తప్పనిసరిగా Google Chrome 142 లేదా అంతకంటే కొత్త వెర్షన్ వాడాలి. అయితే, కొన్ని ప్రత్యేక లేదా అడాప్టివ్ ఆడియో సెటప్స్ ఉన్న యూజర్లకు ఇంకా ట్యాబ్ ఆడియో షేరింగ్‌కే పరిమితం ఉండవచ్చని Google తెలిపింది.

అప్డేట్ విడుదల టైమ్‌లైన్

ఈ ఫీచర్‌ను Google ముందుగా Rapid Release డొమైన్‌లకు రోల్ అవుట్ చేస్తోంది. అన్ని యూజర్లకు అందుబాటులోకి రావడానికి 2026 ప్రారంభం వరకు సమయం పట్టే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. సాధారణ Google Workspace అకౌంట్స్‌కు కూడా దశలవారీగా ఈ ఫీచర్ చేరనుంది.

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్