Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి
Kavitha ( image credit: swetcha reporter)
Political News

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నాచారం లోని షాహీ ఎక్స్ పోర్ట్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులు కలిసి మద్దతు ప్రకటించాలని కోరగా.. వారి ధర్నాకు కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. షాహీ ఎక్స్ పోర్ట్స్ లో మహిళలు చేస్తున్న ఆందోళన అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. ధర్నా చేస్తున్న మహిళలకు ఇబ్బంది అవుతుంది. కానీ వారి స్పిరిట్ కు మాత్రం సెల్యూట్…ఎట్టి పరిస్థితుల్లో సమస్య పరిష్కారమయ్యే వరకు వదల వద్దని మీకు సూచిస్తున్నా.. 15 రోజుల నుంచి ఆడబిడ్డలు 2500 మంది రోడ్డు పై ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు..లేబర్ కమిషనర్ ఎందుకు స్పందించటం లేదో నాకు అర్థం కావటం లేదు.లేబర్ మంత్రి గా ఉన్న వివేక్ వెంటనే దీని మీద ప్రొ యాక్టివ్ స్టెప్ తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి

అసలు ప్రభుత్వం ఏ విషయాన్ని పట్టించుకోవటం లేదనటానికి షాహీ ఎక్స్ పోర్ట్ వాళ్ల ధర్నాయే నిదర్శనం అన్నారు. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దాదాపు 9 ఏళ్లుగా వాళ్ల జీతం లో మార్పు లేదు కానీ ధరలు ఆకాశన్నంటుతున్నాయి.. లేబర్ చట్టాలు అమలు చేయటం లేదు. కరువు భత్యం కూడా ఇస్తలేరు..ఆడబిడ్డల వైపు న్యాయం ఉంది. అందుకే వారు ఫైట్ చేస్తున్నారు..రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఆడబిడ్డలతో కలిసి జాగృతి ఫైట్ చేస్తుందని స్పష్టం చేశారు. మేమే కాదు మిగతా కార్మిక నాయకులను కూడా తీసుకొస్తాం.. లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 2500 మంది ఆడబిడ్డలంటే మీ అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది.. నేను కొత్తగూడెం పర్యటన తర్వాత మీ సమస్యపై పోరాటం చేస్తా.. ఆ లోపే మీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Also Read: Kavitha: జాగృతి పోరాటం వల్లే.. ఐడీపీఎల్ భూముల ఆక్రమణపై విచారణ : కవిత

సర్పంచులకు సన్మానం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ లుగా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ లుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కవిత ని మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా వారిని కవిత సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని సూచించారు.

Also Read: Kavitha: బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టావిప్పుతా.. కవిత కీలక వ్యాఖ్యలు!

Just In

01

Nidhhi Agarwal: లూలూమాల్ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. మాల్ యాజమాన్యంపై సుమోటో కేసు..

Minor Girl Abuse: మైనర్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. మేడ్చల్ కోర్టు సంచలన తీర్పు

Viral Video: పెళ్లి కూతురు కోసం వచ్చి.. బొక్కబోర్లా పడ్డ ఫొటోగ్రాఫర్.. నవ్వులే నవ్వులు!

iPhone 17 Pro: ఐఫోన్ 17 Pro కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో అదిరిపోయే ఎక్స్చేంజ్ ఆఫర్

G Ram G Bill: పంతం నెరవేర్చుకున్న కేంద్రం.. లోక్‌సభలో జీ రామ్ జీ బిల్లుకు ఆమోదం