PM Ujjwala Yojana: ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ఉజ్వల యోజన పథకానికి సబ్బీడీ కోసం 12,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో ఈ పథకం సమర్థవంతంగా కొనసాగేందుకు కేంధ్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో తెలంగాణ(Telangana) ప్రభుత్వం కొత్త రేషన్ కార్టు(Ration card)లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad)లోనే 58,000 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించారు. దీంతో నగరంలోని ప్రజలు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలకు గతంలో దరఖాస్తు చేసుకొని లబ్ధపొందారు.
ప్రధాన మంత్రి ఉజ్వలయొజన పథకం అంటే..?
ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 లో ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మద్య తరగతి కుటుంబాల వారికి నగదు రహిత LPG (వంట గ్యాస్) ఫ్రీ గ్యాస్ కనెక్షన్(Free gas Connection) ఇవ్వడం కోసం కేద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఓక సిలిండర్(Cylinder), మరియు వంట స్టౌ కొంత సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా అందజేయనున్నారు. అయితే ఈ పథకానికి ముఖ్యంగా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. గ్యాస్ కనెక్షన్ కోసం ముందుగా మహిళ పేరునే ప్రదానంగా తీసుకుంటారు. ఈ పథకంలో ఉజ్వల యోజనలో ప్రధానంగా మహిళ పేరు నమోదు చేస్తారు. దీంతో దేశంలోని మహిళలకు కొంత ఆర్థిక, సామాజికంగా అధికారాన్ని పెంచడంతో పాటు, గృహ వంటను సులభతరం చేసేందకు ఉపయోగపడేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్ద్యేశంగా పేర్కోన్నారు.
Also Read: Tungabhadra Dam: తుంగభద్ర నది పరివాహక ప్రాంత రైతులకు షాకింగ్ న్యూస్.. రబీ సాగుకు నీళ్లు బంద్..!
ఈ పథకానికి ఎవరు అర్హులు
ప్రధాన మంత్రి ఉజ్వల యొజన పథకాని ప్రధానంగా SC, ST, ఎకానమిక్‌గా బలహీన వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులుగా తెలిపారు. అంత్యోదయ అన్నయొజన(Antyodaya Anna Yojana), ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM Awas Yojana) పథకాలకు అర్హులుగా ఉండి, రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాల వారికి ప్రత్యేకంగా ఈ పథకం వర్తించేలా చేశారు. గతంలో ఇప్పటికే LPG కనెక్షన్ ఉన్నటువంటి కుటుంబాలకు ఈ పథకం వర్తించదని కేంద్రం పేర్కోంది. దేశంలోని మహిళలందరిని దృష్టిలో ఉంచుకోని దీన్ని ప్రవేశ పెట్టారు. ఆదార్ కార్డు(Aadhaar card), మహిళ భ్యాంకు ఖాతా(Bank Account), రెండు ఫోటోలు తీసుకొని, ఆన్ లైన్(Online)లో అప్లై చేసుకోవాలని కేంద్రం తెలిపింది.
పథకం వలన కలిగే లాభాలు
కేధ్రప్రభుత్వం ఉచితంగా తక్కువ ధరకే LPG గ్యాస్ కనెక్షన్నిఓక సిలిండర్, స్టౌ, పరికరాలను మొదటగా అందజేస్తారు. అయితే ప్రస్తుతం కేంధ్ర ప్రభుత్వం LPG గ్యాస్ పై రూ. 300 రూపాయల సబ్సిడీని అందిస్తుంది. దీన్ని మొత్తం మహిళ ఖాతాలో జమచేయనుంది. పర్యావరణం పరిరక్షణ, కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్రం తన వంతుగా ఈ పథకంతో లాభం చేకూర్చనుందని కొందరు ప్రభుత్వం అధికారులు తెలిపారు. మహిళలు వంటచేసే సమయం ఆదాఅవ్వడం కోసం, కొంత మేరకు మహిళలకు మేలుచేసే పథకంగా కేంద్రం పేర్కొంది.
Also Read: IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

