Emmanuel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, హౌస్‌లోని కంటెస్టెంట్లకు వారి జర్నీ వీడియోలను చూపిస్తూ బిగ్ బాస్ వారిని ఎమోషనల్‌కు గురి చేస్తున్నారు. హౌస్‌లోని టాప్ 5 కంటెస్టెంట్స్‌కు చెందిన ఏవీలను బిగ్ బాస్ రెడీ చేసినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ‘అన్‌స్టాపబుల్ ఇమ్మానుయేల్’ (Unstoppable Emmanuel) అంటూ వచ్చిన ప్రోమోలో కమెడియన్ ఇమ్మానుయేల్ జర్నీ (Emmanuel Bigg Boss Journey) వీడియోని బిగ్ బాస్ చూపించారు. ఈ వీడియో నెటిజన్లను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సాధారణ కమెడియన్‌గా అడుగుపెట్టిన ఇమ్ము, నేడు ఒక హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read- Venu Udugula: పద్మశ్రీ పొందిన ముఖం, ఖాళీ గోడలా కనిపిస్తోందా?.. వేణు ఊడుగుల పోస్ట్ వైరల్!
భావోద్వేగాల ప్రయాణం
‘ప్రతి ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా, ఆసక్తిగా మారుతుంది’ అంటూ బిగ్ బాస్ ఇందులో ఇమ్మాన్యుయేల్ జర్నీని ప్రారంభించారు. చిన్నతనం నుంచీ ఎన్నో కష్టాలను చూసిన ఇమ్మానుయేల్‌కు చిరునవ్వులోని బలం ఎంతో బాగా తెలుసని బిగ్ బాస్ కొనియాడారు. హౌస్‌లో ఎన్ని నామినేషన్లు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన హాస్యంతో వాటిని తిప్పికొట్టిన తీరు ఆయన అభిమానులకు ఎంతో నచ్చింది. ఇంకా ఇమ్ము జర్నీ వీడియోలో తన పాత ఫొటోలు, ముఖ్యంగా తన తల్లితో ఉన్న క్షణాలను చూసుకున్న ఇమ్మాన్యుయేల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఒక కమెడియన్‌గా అడుగుపెట్టిన నువ్వు హీరోగా ఎదగాలన్న మీ అమ్మ కల ఈ రోజు నిజమైంది’ అంటూ బిగ్ బాస్ చెప్పిన మాటలు హౌస్‌లో మారుమోగాయి. ఇది విని ఆయన ఒక్కసారిగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు.
Also Read- Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
తన జర్నీని చూసుకున్న తర్వాత ఇమ్మానుయేల్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ‘ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యు సో మచ్ ఆడియన్స్’ అంటూ ఆయన చేసిన ప్రకటన నెటిజన్ల మనసు గెలుచుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో తన తెలివితేటలతో, గేమ్ ప్లాన్‌తో టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన ఇమ్మానుయేల్, ఫైనల్ రేసులో గట్టి పోటీనివ్వడమే కాదు, కప్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ కప్ కొడితే మాత్రం కమెడియన్‌గా ఆయన హిస్టరీని క్రియేట్ చేసినట్టే. ఇక ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఇమ్మానుయేల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘కష్టపడి పైకి వచ్చిన వారికి విజయం తప్పకుండా దక్కుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమో చూసిన ఆడియెన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నామని స్పందిస్తున్నారంటే, బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి మిగతా హౌస్‌మేట్స్ ఏవీలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

