Siricilla
నార్త్ తెలంగాణ

Siricilla | సిరిసిల్లలో అగ్ని ప్రమాదం.. 14 గుడిసెలు దగ్ధం

కరీంనగర్​ బ్యూరో, స్వేచ్ఛ: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని సాయినగర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 14 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం చత్తీస్ ఘడ్ నుంచి వివిధ కూలీ పనుల కోసం సిరిసిల్లకు వలస వచ్చిన కూలీలు గత కొన్ని రోజులుగా కార్గిల్ లేక్ వద్ద గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆదివారం కూలీలు యాదవిధిగా కూలీ పనులకు వెళ్లారు.

Also Read : జిల్లా అధికారులకు మెమోలు జారీ చేసిన కరీంనగర్ కలెక్టర్

కూలీలు అందరు పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. గుడిసెలు కాలడం చూసిన స్థానికులు పోలీసులకు, ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది… మంటలు ఆర్పినప్పటికీ గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. కూలీల బట్టలతో పాటు సామాను కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?