Kavitha: తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ జాగృతి (Telangana Jagruti) విజయమేనని తేల్చి చెప్పారు. మంగళవారం ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాలనే తాను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
Also Read: MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ
ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలని, తమ కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని చెప్పారు. ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని డిమాండ్ చేశారు.
Also Read: Kavitha: రూ.2500, గ్యాస్ ఫ్రీ హామీలు ఎక్కడ? వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ? : కవిత

