Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం
Harish Rao ( image crediT: swetcha reporter)
Political News

Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: డబ్బు, ప్రలోభాలు లేకున్నా, పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్(BRS)  బలపరిచి విజయం సాధించిన నలుగురు సర్పంచులు వీరారెడ్డిపల్లి బుద్ధుల దుర్గ, నాగిరెడ్డిగూడెం గడ్డం లావణ్య, కొత్తపల్లి సూరారం మంజుల, అనంతరం కొమ్ము శ్రీనివాస్ హైదరాబాద్ లో హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్ చెరు బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన విజేతలను హరీష్ రావు శాలువాలతో సత్కరించి అభినందించారు.

Also Read: Harish Rao: ఆ పేరు పెట్టడం భారతీయులను అవమానించడమే: హరీశ్ రావు

కాంగ్రెస్ వేధింపులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దాం

నీతిగా, న్యాయంగా గెలిచిన మీ విజయం గొప్పది. మనమంతా కేసీఆర్ సైనికులం. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు, కాంగ్రెస్ వేధింపులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దాం అన్నారు.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నిన్న కామారెడ్డి జిల్లా సోమార్పేట్ లో బీఆర్ఎస్ నేత బిట్ల రాజు ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ ట్రాక్టర్ తో దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట. మొన్న నల్గొండ హత్య, నేడు కామారెడ్డి దాడి చూస్తుంటే.. హోంమంత్రిగా రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని స్పష్టమవుతోంది. దాడికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read: Harish Rao: రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అయితే రాజీనామాకు సిద్ధం: హరీష్ రావు

Just In

01

Dr Gopi: రైతుల కష్టాలకు చెల్లు.. ఇది ఒక్కటీ ఉంటే చాలు, ఇంటికే యూరియా!

IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Jupally Krishna Rao: బంగ్లాదేశ్ అవతరణకు కారణం అదే.. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసిన జూపల్లి!