Warangal Road Accident
క్రైమ్, నార్త్ తెలంగాణ

Warangal | వరంగల్ లో ఘోర విషాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ (Warangal) శివారులోని మామునూరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో ఓ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికుల హృదయాలను కలిచివేసింది.

ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఓ లారీ రైలు పట్టాల లోడుతో వెళుతోంది. మామునూరు బెటాలియన్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రెండు ఆటోలని ఢీకొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడడంతో ఏడుగురు మృతి చెందగా… ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాగా, యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?