Viral video: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళా శాసన సభ్యులు
Viral video (Image Source: Twitter)
Viral News

Viral video: చట్టసభలో ఉద్రిక్తత.. జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టుకొట్టుకున్న మహిళా ఎంపీలు

Viral video: మెక్సికో సిటీ కాంగ్రెస్‌ (Mexico City Congress)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలోని పారదర్శకత పర్యవేక్షణ సంస్థకు సంబంధించిన సంస్కరణలపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన మహిళా సభ్యులు.. ఘర్షణ దిగారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆ సమయంలో సభ లైవ్ ప్రసారం జరుగుతుండగా ప్రజలు సైతం ఈ దృశ్యాలు చూసి షాక్ కు గురయ్యారు. కాగా, పరస్పరం దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

తొలుత అధికార మెురేనా పార్టీ (Morena party) ప్రతిపాదించిన చట్టసవరణను వ్యతిరేకిస్తూ విపక్ష నేషనల్ యాక్షన్ పార్టీ (PAN) సభ్యులు పోడియం వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో అధికార, విపక్ష మహిళా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడియం వద్ద నుంచి PAN సభ్యులను బలవంతంగా వెనక్కి పంపేందుకు మెురేనా పార్టీ సభ్యులు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే అది ఘర్షణకు దారి తీసింది. మహిళా సభ్యులు జుట్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సభాధ్యక్షుడు ఎంతగా నచ్చజెప్పినా మహిళా సభ్యులు వెనక్కి తగ్గలేదు.

‘మాపై దౌర్జన్యం చేశారు’

ఘటన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో PAN పార్టీ ప్రతినిధి ఆండ్రెస్ అత్యాదే (Andres Atayde) మాట్లాడారు. తాము శాంతియుతంగా పోడియం వద్దకు వెళ్లినట్లు చెప్పారు. కానీ అధికార పార్టీ సభ్యుల బృందం తమ వద్దకు వచ్చినట్లు చెప్పారు. తమపై దౌర్జన్యానికి దిగినట్లు పేర్కొన్నారు. PAN శాసన సభ్యురాలు డానియెలా అల్వారెజ్ మాట్లాడుతూ నగరాన్ని పాలిస్తున్న పార్టీ ఇలా ప్రవర్తించడం నిజంగా బాధాకరమని అన్నారు.

వైరల్ వీడియోల్లో ఏముందంటే?

వైరల్ అవుతున్న వీడియోలను గమనిస్తే సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం స్పష్టం కనిపిస్తోంది. చెంపదెబ్బలు కొట్టుకోవడం, జుట్టు పట్టుకొని దాడు చేసుకోవడం వంటి చర్యలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొరేనా శాసనసభ్యులు పోడియంపై తిరిగి నియంత్రణ పొందేందుకు ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘర్షణ తర్వాత PAN సభ్యులు.. సభ నుంచి నిష్క్రమించారు. దీంతో సవరణ అంశంపై ప్రతిపక్షం లేకుండానే అధికార మెురేనా పార్టీ చర్చ జరిపించింది.

Also Read: CM Revanth Reddy: యంగ్ ఇండియా స్కూల్స్.. రూ.30 వేల కోట్ల వ్య‌యం.. కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం కీలక భేటి

అధికార పార్టీ రియాక్షన్

మెక్సికో సిటీ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న ఘర్షణపై మెురేనా పార్టీ ప్రతినిధి పాలో గార్సియా (Paulo Garcia) స్పందించారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ చర్చ చేయలేని పరిస్థితిలో విపక్ష సభ్యులు వాదనకు దిగారని అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ఇలా హింసాత్మకంగా వ్యవహరించడం ఆందోళనకరమని గార్సియా అన్నారు.

Also Read: Hyderabad Crime: భర్తతో గొడవ.. ఏడేళ్ల కూతుర్ని హత్య చేసిన కన్నతల్లి

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?