Suriya46: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. సూర్య 46వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై రకరకాల ఊహాగానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (Viswanathan & Sons) అనే టైటిల్, గతంలో సూర్య హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ (Suriya S/O Krishnan) చిత్రాన్ని గుర్తుచేస్తోందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ఒక తండ్రి-కొడుకుల బంధాన్ని గొప్పగా చూపించింది. ఈ కొత్త చిత్రం కూడా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న నేపథ్యంలో, ఈ టైటిల్ ఆ కథా నేపథ్యాన్ని బలంగా సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టైటిల్ కనుక ఖరారైతే, సూర్య కెరీర్లో మరో క్లాసిక్ ఫ్యామిలీ సినిమా రావడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది.
Also Read- Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..
భారీ తారాగణం
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమాకు సంబంధించిన తారాగణాన్ని పరిశీలిస్తే… సూర్య సరసన మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon), అలనాటి నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) వంటి కీలక తారాగణం ఈ చిత్రంలో పాలుపంచుకుంటోంది. ఈ సినిమా కథ కూడా అద్భుతంగా ఉంటుందని, కచ్చితంగా కొన్నాళ్లకు సూర్య వెయిట్ చేస్తున్న హిట్‌ను ఈ సినిమా ఇస్తుందనే నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేస్తోంది.
Also Read- Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!
సూర్య చేస్తున్న సినిమాలివే..
సూర్య46వ చిత్రంతో పాటు, హీరో సూర్య చేతిలో మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ‘కరుప్పు’ (Karuppu) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో (Jeethu Madhavan) చేయనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇందులో నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్గా నటిస్తోంది. వరుసగా ఫ్యామిలీ, యాక్షన్, విభిన్న కథాంశాలతో సినిమాలను ఎంచుకుంటున్న సూర్య, ఈ మూడు చిత్రాలతో అభిమానులను ఎంతగానో అలరించనున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్‌పై అధికారిక ప్రకటన ఎప్పటికి వస్తుందనేది చూడాల్సి ఉంది. టైటిల్ కోసం అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

