Bigg Boss Buzzz: రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ నుండి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లడం ఎప్పుడూ బాధాకరమే అయినప్పటికీ, ఆ తర్వాత ‘బిగ్ బాస్ బజ్’ (Bigg Boss Buzzz) కార్యక్రమంలో ప్రసారమయ్యే ఎగ్జిట్ ఇంటర్వ్యూ మాత్రం ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని, స్పష్టతను అందిస్తుంది. తాజాగా, బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటైన భరణి (Bharani), నటుడు శివాజీ (Sivaji) హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ బజ్’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోపై భారీ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. అందుకు కారణం భరణి రెండు సార్లు హౌస్‌లోకి వెళ్లడమే. ఇదే విషయాన్ని శివాజీ ప్రస్తావిస్తున్నారు. ఇందులో భరణి తన హౌస్ జర్నీలోని అనేక తెలియని, అంతర్గత విషయాలను నిస్సంకోచంగా వెల్లడించినట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది. ‘నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది’ అని భరణి చెప్పడం చూస్తుంటే.. విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో ప్రతీ కంటెస్టెంట్ వేసే ముసుగుల గురించి, గేమ్‌లో వారు అనుసరించిన వ్యూహాల గురించి భరణి స్పష్టంగా, విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు.
Also Read- Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..
నిజమైన మనిషిగా
బిగ్ బాస్ హౌస్‌లో భరణి ప్రయాణం ఒడిదుడుకులతో కూడుకున్నదనే విషయం తెలియంది కాదు. హౌస్‌మేట్స్‌తో విభేదాలు, భావోద్వేగాల ప్రదర్శన, టాస్క్‌లలో అతని దూకుడు.. అన్నీ ప్రేక్షకులకు ఒక నిజమైన మనిషిని చూపించాయి. తన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో, అతను ఏ ఒక్క కంటెస్టెంట్‌ను కించపరచకుండా, కానీ అదే సమయంలో తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు. తోటి కంటెస్టెంట్లలో ఒకరైన తనూజ (Tanuja) గురించి భరణి చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో హౌస్‌లో జరిగిన కొన్ని సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టాయి. ఈ ఇంటర్వ్యూ కేవలం ఎలిమినేట్ అయినందుకు నిర్వహించిన సంభాషణలా కాకుండా, మొత్తం సీజన్ యొక్క లోతైన మానసిక విశ్లేషణగా భావించవచ్చు.
Also Read- Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!
ప్రేక్షకుల హృదయంలో స్థానం
భరణి చూపిన స్పష్టత, పరిణతి.. అతను ఎలిమినేటైన తర్వాత కూడా అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించి పెట్టింది. హౌస్ లోపల అతని ఆట ఎలా ఉన్నా, బయటకు వచ్చాక అతను తన అనుభవాలను పంచుకున్న తీరు అతని వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచింది. అతని ఇంటర్వ్యూ యొక్క ప్రొమోలు, క్లిప్‌లు సోషల్ మీడియాలో లక్షల వ్యూస్‌తో వైరల్ అవుతున్నాయి. ఇది అతని ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందో రుజువు చేస్తుంది. మొత్తం మీద, ‘బిగ్ బాస్ బజ్’లో భరణి చెప్పిన సమాధానాలతో.. ప్రస్తుతం హౌస్‌లోని ఉన్న హౌస్‌మేట్స్ అభిమానుల మన్ననలను కూడా అందుకుంటున్నారు. హౌస్‌లో నాకంటే గొప్పగా ఉన్న ఐదుగురు ఆడారు కాబట్టే.. నేను ఇప్పుడు బయటికి వచ్చాను అని ఆయన అంగీకరించిన విధానానికి అంతా ఫిదా అవుతున్నారు. సంజన విషయంలో కూడా ఆయన రాజీ లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తంగా చూస్తే.. భరణి ఎలిమినేట్ అయినప్పటికీ.. అందరికీ ఈ బజ్ ద్వారా మంచి ట్రీట్ ఇచ్చాడనేలా అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

