Vikarabad Crime: ట్రాక్టర్‌తో భర్తను గుద్దిచంపించిన భార్య
Vikarabad Crime (imagecredit:twitter)
క్రైమ్, హైదరాబాద్

Vikarabad Crime: ప్రియుడిని కలవకుండా అడ్డొస్తున్నాడని.. ట్రాక్టర్‌తో గుద్ది భర్తను చంపించిన భార్య!

Vikarabad Crime; వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించింది ఓ ఇల్లాలు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వికారాబాద్(Vikarabad) జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చౌడాపూర్ వాస్తవ్యులైన కవిత(Kavitha), రత్నయ్య(Ratnayya) భార్యాభర్తలు. కాగా, కవితకు కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు ఈ అక్రమ సంబంధం గుట్టుగా సాగినా ఆ తరువాత ఇరుగుపొరుగు ద్వారా రత్నయ్యకు తెలిసింది. దాంతో భార్యను భర్త నిలదీశాడు.

పథకం ప్రకారం

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేయాలని కవిత నిర్ణయించుకుంది. అదే విషయాన్ని రామకృష్ణ(Ramakrishna)కు చెప్పింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి రత్నయ్య హత్యకు పథకం వేశారు. దాని ప్రకారం పొలం నుంచి ఇంటికి వస్తున్న రత్నయ్యను చేసిన కుట్ర ప్రకారం రామకృష్ణ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంట్లో తీవ్రంగా గాయపడ్డ రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. కాగా, కవిత రోడ్డు ప్రమాదంలో రత్నయ్య చనిపోయినట్టుగా అందరినీ నమ్మించింది.

Also Read: Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

అనుమానం వ్యక్తం

పోలీసులు కూడా మొదట జరిగింది యాక్సిడెంట్(Acident) అనే భావించారు. అయితే, రత్నయ్య మరణంపై అతని సోదరుడు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు లోతుగా విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కవిత, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పథకం ప్రకారం రత్నయ్యను హత్య చేసినట్టు ఇద్దరూ అంగీకరించారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: BRS Water Politics: నీటి వాటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి సన్నాహాలు.. త్వరలో కేసీఆర్ ప్రకటన చేసే ఛాన్స్..!

Just In

01

Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!

Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Telangana Jagruti: కవిత మీద అవాకులు పేలితే ఊరుకోబోం.. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్!

Kodanda Reddy: కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!