Hollywood: కాలిఫోర్నియాలోని బ్రెంట్‌వుడ్‌లో ప్రముఖ దర్శకుడు & నటుడు రాబ్ రైనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ తమ ఇంట్లో మృతిగా కనిపించారు. ఇద్దరి శరీరాలపై కత్తిపోట్ల గాయాలు ఉండటంతో పోలీసులు డబుల్ హత్యగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీన్ని డబుల్ మర్డర్ కేసుగా అనుమానిస్తున్నారు.
రాబ్ రైనర్, మిచెల్ ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లకు సంబంధించిన గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇది సహజ మరణం కాదని, ఎవరో దాడి చేసి చంపి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read: MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!
లాస్ ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 14న మధ్యాహ్నం 3:38 గంటలకు లాస్ ఏంజెలెస్‌లోని సౌత్ చాడ్‌బోర్న్ అవెన్యూలో ఉన్న ఒక ఇంటి నుంచి మెడికల్ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది ఇంట్లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆ ఇంట్లో రాబ్ రైనర్ దంపతులే ఉంటున్నారని చుట్టు పక్కల వారు స్థానిక మీడియాకు చెప్పారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే బ్రెంట్‌వుడ్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ కేసు దర్యాప్తును ఇప్పుడు లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) లోని రాబరీ–హోమిసైడ్ విభాగం చేపట్టింది. ఎవరు ఈ హత్యలు చేశారు? ఎందుకు చేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానితులను అధికారికంగా ప్రకటించలేదు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

