Sircilla Panchayat Elections: సిరిసిల్ల నియోజక వర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తంగళ్లపల్లి మండలం 30 స్థానాలకు గాను 20 స్థానాల్లో గెలిచి గులాబీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు నిలుపుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యింది. రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం పై జనంలో ఉన్న వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. పదికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలవడం పార్టీ పై ప్రజల వ్యతిరేకతకు నిదర్శనం.
దరిదాపుల్లో కూడా లేని బీజేపీ
కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్లలో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిక నిధులు ఇస్తామని బండి సంజయ్ చేసిన ప్రకటనను పల్లె ప్రజలు పట్టించుకోలేరు. 16 గ్రామాల్లో బిజెపికి అభ్యర్థులు కూడా పోటీకి దొరక్కపోవడం గమనార్హం.
Also Read: Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!
మూడవ విడుత ఎన్నికలపై తంగళ్లపల్లి ప్రభావం
మూడవ విడతలో ఈ నెల 17 జరుగనున్న ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల సర్పంచ్ ఎన్నికలపై తంగళ్లపల్లి మండలం ఫలితాల ప్రభావం పడనుంది. బీఆర్ఎస్(BRS) శ్రేణులు వచ్చిన పలితాలతో జోష్ లో ఉన్నారు. నాలుగు మండలాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Also Read: KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

