Aswini Dutt: 50 ఏళ్ల వైజయంతి ప్రయాణం.. నిర్మాత కృతజ్ఞతలు
Aswini Dutt (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Aswini Dutt: టాలీవుడ్ ప్రతిష్టాత్మక బ్యానర్‌లలో ఒకటైన వైజయంతి సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, నిర్మాత చలసాని అశ్వినీదత్ (Aswini Dutt).. సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ విడుదల చేశారు. ఈ లెటర్‌లో ఈ సంస్థలో పని చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థ ఎలా ప్రారంభమైంది, ఎవరు నామకరణం చేశారు, ఎవరెవరు ఈ బ్యానర్‌లో సినిమాలు చేశారు, దర్శకులెవరు? హీరోలెవరు? వంటి విషయాలతో ఆయన విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ ఈ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుతున్నారు. అశ్వినీదత్ విడుదల చేసిన లేఖలో..

Also Read- Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

‘‘50 సంవత్సరాలుగా మా వైజయంతి సంస్థను మీ హృదయాల్లో నిలుపుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిగా ‘వైజయంతి మూవీస్’ (Vyjayanthi Movies) అని నామకరణం చేసి, ఈ సంస్థకు ప్రాణం పోసి, బలమైన పునాదులు వేసిన నందమూరి తారక రామారావుకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత, మా సంస్థ ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి మా మీద అపారమైన నమ్మకం ఉంచి, ప్రతి సినిమాను ఎంతో ఆదరించి, ఎన్నో విజయాలకు శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నా తొలి చిత్రాన్ని రూపొందించిన కళాతపస్వి కే. విశ్వనాథ్‌, బాపయ్య, కె. రాఘవేంద్రరావు, అలాగే మా వైజయంతి బ్యానర్‌లో పనిచేసిన ఇతర దర్శకులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.

Also Read- Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

మీతోనే… మీకోసమే

మా వైజయంతి ప్రయాణంలో భాగస్వాములైన అగ్ర నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మరియు ఈ తరం అగ్ర నటులు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ వంటి ఇతర నటులందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. మా వైజయంతి బ్యానర్‌ను నమ్మి తమ ప్రతిభతో వెలిగించి, మా చిత్రాలను మరింత ఉన్నతంగా నిలిపిన హీరోయిన్లు, సంగీత దర్శకులు, రచయితలు, ఛాయాగ్రాహకులు, ఎడిటర్లు.. ఇలా ప్రతి సాంకేతిక నిపుణుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సంస్థ యొక్క బాధ్యతలను ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్న స్వప్న, ప్రియాంక, స్రవంతి, నాగ్ అశ్విన్‌లను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు, ఎన్నో మైలురాళ్లు, ఎన్నో హృదయాలను గెలుచుకోవడం ఇవన్నీ మీ వల్లనే సాధ్యమయ్యాయి. చివరిగా, మా ప్రతి సినిమాను పండుగలా మార్చి, వైజయంతిని ఒక కుటుంబంగా భావించిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ వైజయంతి సంస్థ ప్రయాణం మీతోనే… మీకోసమే…’’ అని అశ్వనీదత్ ఈ లేఖలో పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క