Revanth Reddy - Messi: మెస్సీతో మ్యాచ్‌పై సీఎం ఆసక్తికర ట్వీట్
Revanth-Messi (Image Source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Revanth Reddy – Messi: సాకర్ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన క్షణాలను (Revanth Reddy – Messi) గడిపారు. శనివారం రాత్రి హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఆయన మనసారా ఆస్వాదించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన మెస్సీతో ఒక పొలిటీషియన్, అందులోనూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మైదానంలో అడుగుపెట్టడం క్రీడాభిమానులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. మెస్సీతో ఆడిన ఆ కాసేపు రేవంత్ రెడ్డి మొహంలో కనిపించిన ఉత్సాహం, సంతోషం ఆయనకు ఈ మ్యాచ్ ఎంత ప్రత్యేకమో చెప్పకనే చెప్పింది. అంతటి మధుర జ్ఞాపకాన్ని మిగిల్చిన మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మరోసారి స్పందించారు.

ఫుట్‌బాల్ G.O.A.T (Greatest Of All Time) లియోనెల్ మెస్సీతో పాటు, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సురెజ్, రోడ్రిగో డి పాల్ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరానికి విచ్చేసి, క్రీడాభిమానులందరినీ, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం (డిసెంబర్) సాయంత్రాన్ని జీవితంలో ఒక మరచిపోలేని జ్ఞాపకంగా మలచినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. తమతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

Read Also- Cyber Crime: రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. నలుగురు చైనా పౌరులపై సీబీఐ ఛార్జ్‌షీట్.. 111 షెల్ కంపెనీలు బట్టబయలు

‘‘తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్ఠత, తెలంగాణ అంటే ఆతిథ్యం అని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, నగరవ్యాప్తంగా విధుల్లో ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, ఉద్యోగులందరికీ నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అద్భుతమైన ప్రవర్తన, క్రమశిక్షణను కనబరచిన క్రీడాభిమానులు, ప్రేక్షకులు అందరికీ ప్రభుత్వం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు.

శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌పై అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదొక చిరస్మరణీయమైన క్షణమంటూ కొనియాడారు. మెస్సీ అద్భుతమైన నైపుణ్యం, మైదానంలో ఆయన ప్రదర్శించిన నిరాడంబరత ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఫుట్‌బాల్ అంటే తనకు ఎంతో ఇష్టమని రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయంగా మెస్సీతో ఆడటం తన జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టమని చెప్పారు. ఈ అనుభవం తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి మరింత కృషి చేయడానికి తనకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

Read Also- Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..