Chain Snatching: ఆదివారం ఉదయం దౌల్తాబాద్(Daulatabad) మండల పరిధిలోని కోనాపూర్(Konapur) గ్రామ శివారులో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన కలకలం రేపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్తున్న ఓ మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తేల తాడును గుర్తుతెలియని దుండగుడు లాకెళ్లాడు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం పల్సర్ బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమెను బెదిరించి పుస్తేల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.
Also Read: Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం
చుట్టుపక్కల రైతులు
ఘటన జరిగిన వెంటనే మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు చేరుకుని సమాచారం పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న తోగుట సీఐ లతీఫ్(CI Latif), దౌల్తాబాద్ ఎస్సై గంగాధర అరుణ్‌కుమార్(SI Gangadhara Arun Kumar) ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుండగుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

