AIIMS Bibinagar: తెలంగాణోళ్ల డీఎన్ఏలో డేంజర్ బెల్స్..!
AIIMS Bibinagar (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల గుండె ఆరోగ్యంపై ఎయిమ్స్ బీబీనగర్(AIIMS Bibinagar) నిర్వహించిన ఒక కీలక పరిశోధన ఆందోళనకరమైన నిజాలను బయటపెట్టింది. రాష్ట్రంలోని ప్రజల డీఎన్ఏ(DNA)లోనే గుండె జబ్బులకు దారితీసే ‘డేంజర్ బెల్స్’ ఉన్నట్లుగా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా, చిన్న వయసులోనే గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణంగా వంశపారంపర్యంగా వచ్చే ‘ఫ్యామిలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా ‘ అనే జన్యుపరమైన సమస్య ఉందని తేలింది.

చిన్న వయసులోనే గుండె ఎందుకు ఆగుతుంది..? 

కొద్ది సంవత్సరాలుగా, తెలంగాణలో 30-40 ఏళ్ల లోపు యువత కూడా గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్లు దీన్ని జీవనశైలి మార్పులు, ఒత్తిడికి ఆపాదించినా, ఎయిమ్స్ పరిశోధన దీని వెనుక ఉన్న ముఖ్యమైన జన్యుపరమైన కారణాన్ని వెలుగులోకి తెచ్చింది. ​హైపర్ కొలెస్టెరోలేమియా తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఈ జన్యువు ప్రభావం ఇతరుల కంటే అధికంగా ఉన్నట్లు తేలింది. ఫ్యామిలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా అనేది ఒక వ్యక్తి కాలేయం కొలెస్ట్రాల్‌ను సరిగా తొలగించకుండా నిరోధించే జన్యుపరమైన లోపం. ఈ జన్యు సమస్య కారణంగా, ప్రభావితమైన వ్యక్తులలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పుట్టుక నుంచే అత్యధికంగా ఉంటాయి.

Also Read: Messi – Kolkata Tour: కోల్‌కత్తాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. మైదానంలోకి దూసుకొచ్చి రణరంగం

​గుండెకు ముప్పు.. 

చిన్న వయసు నుంచే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల, వారు 30-40 ఏళ్ల నాటికే తీవ్రమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజల డీఎన్ఏలో ఎఫ్ హెచ్(FH) జన్యువు ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిశోధనలో స్పష్టమైంది. ఇది కేవలం జీవనశైలి సమస్య మాత్రమే కాదు, జన్యుపరమైన ముప్పు కూడా. ఈ ముప్పును ముందుగానే గుర్తించడం అత్యవసరం అని ఎయిమ్స్ అధికారులు వివరించారు..

ముప్పును గుర్తించడం ఎలా? 

​ఈ ఎఫ్ హెచ్ సమస్య ఉన్న వ్యక్తికి గుండె జబ్బు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తి కంటే 20 రెట్లు అధికం. అందుకే, ఈ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స అందించడం చాలా కీలకం. ​కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే (పురుషులైతే 55 ఏళ్ల లోపు, మహిళలైతే 60 ఏళ్ల లోపు) గుండెపోటు వచ్చి ఉంటే, మిగతా కుటుంబ సభ్యులు తప్పకుండా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ​ఎటువంటి జీవనశైలి సమస్యలు లేకపోయినా, ఒక వ్యక్తికి ఎల్ డీ ఎల్(LDL) కొలెస్ట్రాల్ స్థాయిలు 190 కంటే ఎక్కువగా ఉంటే, అది ప్రమాద కర పరిస్థితులు అని భావించాలని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read: Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు