Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో 97వ రోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ రోజు ప్రోమో ముఖ్యంగా ఒక గేమ్‌ను సీజన్‌లో అత్యంత కీలకమైన డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌ను టీజ్ చేసింది. 97వ రోజు హౌస్‌మేట్స్ మధ్య ‘రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్’ గేమ్ జరిగింది. ఈ గేమ్ కంటెస్టెంట్లలో ఒకరి గురించి మరొకరికి ఉన్న అభిప్రాయాలను, అనుకూలతలు లేదా ప్రతికూలతలను బహిరంగంగా వ్యక్తం చేయడానికి వేదికగా నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో కంటెస్టెంట్ ఎమాన్యుయెల్ ఎక్కువ గ్రీన్ ఫ్లాగ్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే, తోటి హౌస్‌మేట్స్ అతని ప్రవర్తన లేదా ఆటతీరును సానుకూలంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. డే 97 ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణ అత్యంత ఆందోళన కలిగించే అంశం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్. ప్రోమో ఈ డబుల్ ఎలిమినేషన్ తీవ్రతను, దాని హై-స్టేక్స్‌ను నొక్కి చెప్పింది. ఫినాలేకు అతి దగ్గరలో ఉన్న ఈ సమయంలో ఒకేసారి ఇద్దరు ఇంటి నుంచి నిష్క్రమించడం హౌస్‌లో మిగిలిన ఆటగాళ్లకు పెద్ద షాక్‌ను ఇస్తుంది. ఈ డబుల్ ఎలిమినేషన్‌కు ముందు, ఏడుగురు హౌస్‌మేట్స్‌తో ఆడే ఒక గేమ్ గురించి చర్చ జరుగుతోంది. డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఎవరు మిగులుతారనే ఉత్కంఠను ఈ ప్రోమో పెంచేసింది. డే 97 ఎపిసోడ్ ఎమోషన్స్, చర్చలు ఊహించని ఎలిమినేషన్‌లతో నిండి ఉండనుంది.
Read also-Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..
ఇక ఈ వారం ఎలిమినేషన్స్ విషయానకి వస్తే.. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున కన్పామ్ చేసేశారు. అయితే అందులో ఆ ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నాది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి అని సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది.. అయితే సుమన్ శెట్టితో పాటు భరణి కూడా ఎలిమినేట్ అవుతారని సమాచారం. ఎందుకు అంటే ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో వీరిద్దరి స్నేహం గురించి ఒక ప్రోమోనే వేశారు. అదే స్నేహంతో ఇద్దరూ ఒకే సారి వెళ్లి పోతారని అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం సుమన్ శెట్టి తో సంజన వెళిపోతుంది అంటూ చెబుతున్నారు. మరి కొందరు మత్రం సుమన్ శెట్టి పవన్ ఎలిమినేట్ అవుతారని ప్రిడిక్ట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి మాత్రం పక్కా ఎలిమినేట్ అవుతారని సమాచారం.. అయితే ఏం జరిగిందో తెలియాలంటే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

