Gurram Papireddy: ప్రేక్షకులకు కొత్త రకం వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన డార్క్ కామెడీ జానర్‌లో తెరకెక్కించారు. ఇది తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని కొత్త అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు నిర్మాతలు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమా కామెడీ జోనర్ లో ఉండబోతుందని తెలిపేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా ప్రేక్షకులు. ఎప్పుడూ చూడని డార్క్ కామెడీ కథ ఈ సినిమాలో ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read also-Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?
ట్రైలర్ ను చూస్తుంటే.. బ్రహ్మానందం డైలగ్ , నా పేరు జీజీవైధ్యనాధన్ తో మొదలవుతుంది ఈ ట్రైలర్.. డార్క కామెడీ జోనర్ లో సాగే ఈ ట్రైలర్ ఆథ్యాతం నవ్విస్తుంది. న్యాయమూర్తి పాత్రలో కనిపించిన బ్రహ్మానందం.. మెదటి నుంచే నవ్వంచడం మొదలు పెడతాడు.. అగస్య ఫరియా అబ్దుల్లా మధ్య కామెడీ టైమింగ్స్ బాగా కుదిరాయి. కసిరెడ్డి ఎప్పటిలాగే తన చేస్టలతో మాటలతో నవ్విస్తాడు. శ్రీశైలం అడవుల్లో ఉన్న ఓ శవాన్ని తవ్వుకు రావాలి అంటాడు. అది ఎందుకు వాటితో ఏం చేస్తాడు.. అందుకోసం వెళ్లిన హీరో ఫ్రెండ్స్ ఎలా సాయం చేస్తారు.. సాయం చేసే క్రమంలో వారు ఎలా ఇరుక్కుంటారు.. అనేది టీజర్ లో చూపించారు. వీరి మధ్య జరిగిన సంబాషణలు అందరినీ నవ్విస్తాయి. యోగి బాబు తెలుగులో ఇది మొదటి సినిమా ఆయన అయన కనిపిస్తేనే నవ్వువస్తుంది. కామెడీ ఓరియంటెడ్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే నవ్వు వస్తుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?

