Messi In Hyderabad: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియాను (Messi In Hyderabad) పతాక స్థాయికి చేర్చుతూ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ ముగిసింది. ‘G.O.A.T. ఇండియా టూర్ 2025లో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్ వర్సెస్ అపర్ణ టీమ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడారు. సింగరేణి ఆర్ఆర్ తరపున రేవంత్ రెడ్డి ఆడారు. ఇక, అపర్ణ టీమ్ తరపున మెస్సీ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే రీతిలో ఒక గోల్ కొట్టారు. మెస్సీని చూడడానికి వచ్చిన వేలాది మంది అభిమానుల మధ్య, ఈ మ్యాచ్, మొత్తం ఈవెంట్ అంచనాలను మించి ఉత్సాహభరితంగా సాగింది.
మెస్సీ ఎంట్రీతో ఉర్రూతలు
మెస్సీ స్టేడియంలోకి ఎంటరైనప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. సంగీత కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లియోనెల్ మెస్సీ తన సహచర ఆటగాడు లూయిస్ సువారెజ్‌తో పాటు స్టేడియంలోకి అడుగుపెట్టగానే ప్రేక్షకులు లేచి నిలబడి చేసిన కేరింతలు కొట్టారు. ఆ సమయంలో లైటింగ్, సౌండ్ ఎఫెక్టులతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోయింది.
Read Also- SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!
స్కిల్స్ ప్రదర్శించిన మెస్సీ
ఫ్రెండ్లీ మ్యాచ్ 15 నిమిషాల పాటు జరిగింది. మెస్సీ మైదానంలోకి దిగి క్రీడాకారులతో ఆడకపోయినప్పటికీ, బంతి అందుకొని తన అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడు. సీఎం రేవంత్ రెడ్డి, తన సహచర ఆటగాళ్లకు, ఆ తర్వాత చిన్నారులకు బంతి పాస్ చేశాడు. దాదాపు 20 నిమిషాలతో తన ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మెస్సీ కొన్ని ఫుట్‌బాల్స్‌ను ప్రేక్షకుల గ్యాలరీల్లోకి కొట్టాడు.
సీఎం రేవంత్ రెడ్డి మెరుపు గోల్
ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక పాస్‌ని చక్కగా అందుకొని, డిఫెండర్లను తప్పించుకుని, గోల్‌కీపర్‌ను కూడా దాటి బంతిని నేరుగా నెట్స్‌లోకి పంపించారు. దీంతో, స్టేడియం దద్దరిల్లింది. సీఎం గోల్ కొట్టగానే స్టేడియంలోని అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఆనందోత్సాహాలతో చప్పట్లు, ఈలలు కొట్టారు. గోల్ కొట్టిన రేవంత్‌ను మెస్సీ అభినందించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సీ మైదానం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు.
Read Also- Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాహుల్ గాంధీ
కార్యక్రమం ముగింపులో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఆయన పాల్గొన్నారు.
What a Movement this is 🥹😍❤️
LEO MESSI PLAYING FOOTBALL WITH TELANGANA CM REVANTH REDDY AT THE UPPAL. 😍 pic.twitter.com/X6DTaSqp19
— @vinay_09 (@vinay_00009) December 13, 2025
CRAZY VISUALS FORM HYDERABAD 🚨
– Legend Lionel Messi has arrived in Hyderabad 🔥
Kolkata needs to learn from Hyderabad, this is how fans needs to react 🤐pic.twitter.com/5GTDcRKQo1
— Richard Kettleborough (@RichKettle07) December 13, 2025
The Hyderabad #GOATIndiaTour is a big success
Well Organised
Messi went around whole stadium waving the fans
Messi kicked the ball around
Scored 2goals
Congratulations to everyone who attended the event and CM of Telangana Revanth Reddy
Thank you #Messi𓃵#MessiInIndia pic.twitter.com/lHweQs2fJZ— vasanth🏆🤍 (@vasanthTHFC) December 13, 2025

