KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. కేటీఆర్ ధీమా
KTR (Image Source: Twitter)
Telangana News

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

KTR: రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వందలాదిగా తరలివచ్చిన సర్పంచులు, పార్టీ నేతలతో కేటీఆర్ నివాసం కోలాహలంగా మారింది. నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు సైతం కలిశారు.

కాంగ్రెస్ అక్రమాలపై ప్రజా తీర్పు

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితి వెంటే నిలిచారని అన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరి పోరాట పటిమను ఆయన అభినందించారు.

ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు పదుల సంఖ్యలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. ‘స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఎత్తున మన సర్పంచులు గెలవడం.. కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు, బీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రజా సానుకూలతకు నిదర్శనం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read: Messi in Hyderabad: హైదరాబాద్ చేరుకున్న మెస్సీ.. మరికాసేపట్లో సీఎం రేవంత్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్.. వీక్షించనున్న రాహుల్ గాంధీ

సర్పంచ్‌లతో వరుస భేటీలు

రానున్న వారం, పది రోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచులను కలుసుకోనున్నారు. వారిని సత్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

Also Read: Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క