Messi in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi in Hyderabad) భారత్ పర్యటనలో భాగంగా కొద్దిసేపటిక్రితం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి (డిసెంబర్ 13) మెస్సీ – సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం, సాయంత్రం 4:15 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, నేతలు స్వయంగా ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.
స్వాగతం అనంతరం రాహుల్ గాంధీ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఉప్పల్‌లో జరగనున్న మ్యాచ్ కోసం సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్య ఆయన స్టేడియానికి బయలుదేరతారని తెలుస్తోంది. మెస్సీ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఈవెంట్‌కు రాహుల్ గాంధీ హాజరు కావడంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, మ్యాచ్ వీక్షించిన అనంతరం రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారని సమాచారం.
భారీ భద్రత..
మెస్సీ-సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలో మెస్సీ ఆడాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు కావడం, అనంతరం చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ నేరుగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని పరిశీలించారు.
7.50కి మ్యాచ్ ప్రారంభం..
షెడ్యూల్ ప్రకారం, రాత్రి 7.15 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ రాత్రి 7.50 గంటలకు మొదలవుతుంది. 8.06 గంటలకు ముఖ్యమంత్రి ప్రవేశిస్తారు. 2.07 గంటలకు లియోనెల్ మెస్సీ మైదానంలోకి అడుగుపెడతాడు. వీరిద్దరూ మార్కింగ్ ప్రకారం పొజిషన్ తీసుకుంటారు. 8.08 గంటలకు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి ఎంటర్ అవుతారు. 8.10 గంటలకు హార్డ్ స్టాప్. అంటే, మ్యాచ్‌ను నిలిపివేస్తారు. 8.11 గంటలకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి బాల్‌తో డ్రిబుల్ చేస్తారు. అంటే, ప్రత్యర్థిని చేధించుకొని బంతికి ముందుకెళ్లడం.
8.13 గంటలకు పెనాల్టీ షుటౌట్
8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ ఉంటుది. గోట్ కప్ విజేతను నిర్ణయించేందుకు ఇరు జట్లు చెరో 3 షాట్లు కొడతాయి. రాత్రి 8.13 గంటలకు రాహుల్ గాంధీ మైదానంలోకి అడుగు పెడతారు. 8.15 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన రెండు జట్లతో గ్రూప్ ఫొటో ఉంటుంది. పిల్లలతో ఈ ఫొటోలు దిగుతారు. 8.17 గంటలకు టికీ టాకీ జోన్ 1 (పిల్లల క్లినిక్) ప్రారంభం ఉంటుంది. లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం రేవత్, రాహుల్ గాంధీ పాల్గొంటారు. 8.22 గంటలకు టికీ టాకీ – జోన్ 2 (పిల్లల క్లినిక్) ప్రారంభం, 8.27కి జోన్-3 క్లీనిక్, 8.32 జోన్-4 క్లీనిక్ ప్రారంభిస్తారు. 8.53కి కప్ ప్రదానం, 8.58కి రేవంత్ రెడ్డి, 8.59 గంటలకు రాహుల్ గాంధీ మాట్లాడుతారు. 9.10 గంటలకు కార్యక్రమం పూర్తవుతుంది.
Along with PCC President Shri Mahesh Kumar Goud, I extended a warm welcome to the Leader of the Opposition in the Lok Sabha and Congress leader, Shri Rahul Gandhi ji, on his arrival at Shamshabad Airport. #RahulGandhi #TelanganaRising pic.twitter.com/Ce2F5mfhYM
— Revanth Reddy (@revanth_anumula) December 13, 2025

