RajaSaab Second Single: ‘ది రాజాసాబ్’ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే
the-rajasab-second-single(X)
ఎంటర్‌టైన్‌మెంట్

RajaSaab Second Single: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సెకండ్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్.. వచ్చేది ఎప్పుడంటే?

RajaSaab Second Single: ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సింగిల్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సెకండ్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు థమన్. ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఇప్పుడే మిక్సింగ్ పూర్తయిందని, సాంగ్ అందరికీ నచ్చుతుందని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అంతే కాకుండా.. ఈ పాటకు సంబంధించి ప్రోమో రేపో, మాపో విడుదల అవుతుందంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రెండో సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. మరి సెకండ్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Read also-Ustaad BhagatSingh song: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ టైమ్‌కి రెడీగా ఉండండి.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీ.జీ. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read also-Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్‌కు పండగే..

తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఓవర్సీస్ (నార్త్ అమెరికా)లో ‘ది రాజా సాబ్’ క్రేజ్ అప్పుడే మొదలైంది. ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే లక్ష డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది ప్రభాస్ స్టామినాను మరోసారి చాటిచెబుతోంది. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’కు కూడా మంచి స్పందన లభించగా, మేకర్స్ త్వరలోనే రెండో పాటను విడుదల చేసి ప్రమోషన్స్ వేగాన్ని పెంచనున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో తొలి హారర్ ఫాంటసీగా ప్రచారం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క