Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులకు మరో గుడ్ న్యూస్ రానుందా? అంటే అవునేనే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన ‘వారణాసి’ (పాన్ వరల్డ్ సినిమా) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మరింత పవర్-ప్యాక్డ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఆ గుడ్ న్యూస్ మరేంటో కాదు – ఊర మాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sundeep Reddy Vanga)తో మహేష్ బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కావడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సందీప్‌తో మహేష్ బాబు కలిస్తే విధ్వంసమే
సందీప్ రెడ్డి వంగా.. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. ఆయన సినిమాల్లో ఉండే ఇంటెన్స్, రా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అలాంటి దర్శకుడితో మహేష్ బాబు కలిస్తే విధ్వంసమే. వాస్తవానికి మహేష్ బాబు, సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా రావాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో, వారిద్దరూ కలిసి ఉన్న ఒక పిక్ వైరల్ అయినప్పుడు, వారి కాంబోలో సినిమా రాబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ, ఇప్పుడు అంతా సెట్ అయినట్లుగా తెలుస్తోంది. మహేష్ వైఫ్ నమ్రత ఇప్పుడదే పనిలో ఉన్నట్లుగా వార్తలు మొదలయ్యాయి.
Also Read- Come 2 Dhee Party: సుధీర్, హైపర్ ఆదిల ‘ఇయర్ ఎండింగ్ పార్టీ’ టీజర్ వచ్చింది చూశారా? మొత్తం పోతారు!
‘వారణాసి’, ‘స్పిరిట్’ తర్వాతే…
ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై కూడా అప్పుడే వార్తలు మొదలయ్యాయి. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ (Varanasi) పూర్తయిన తర్వాత, అలాగే సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న ‘స్పిరిట్’ (Spirit Movie) సినిమా పూర్తి చేసిన తర్వాతే, వీరిద్దరి కలయికలో ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా సమాచారం. సందీప్ వంగా మార్క్ యాక్షన్, మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్ కలగలిస్తే ఫ్యాన్స్‌కు మరో ‘ఊర మాస్ ట్రీటే’. ఈ హై-పవర్ కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనే దానిపై ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అధికారిక అనౌన్స్‌మెంట్ రాగానే, ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వెళ్లడం ఖాయం. ప్రస్తుతానికైతే ఈ కాంబోపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

