Dr Nori Dattatreyudu: సమ్మిట్ పై నోరిదత్తాత్రేయుడు కీలక వ్యాఖ్యలు
Dr Nori Dattatreyudu (imagecredit:twitter)
Telangana News

Dr Nori Dattatreyudu: గ్లోబల్ సమ్మిట్ విజయవంతం పై.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కీలక వ్యాఖ్యలు

Dr Nori Dattatreyudu: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రికి లేఖలో పేర్కొన్నారు.

విశ్వాసానికి నిదర్శనం

డీప్‌టెక్(Deeptech), గ్రీన్‌ఎనర్జీ(Green Energy), లైఫ్ సైన్సెస్(Life Sciences) వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్ 2047 ( Telangana Rising 2047) విజన్‌కు అద్దం పడుతుందని, ల‌క్ష‌ల కోట్ల రూపాయల పెట్టుబ‌డులు రావ‌డం ముఖ్య‌మంత్రి పాల‌న‌, స్థిర‌త్వం, భ‌విష్య‌త్తుపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ పోటీ పడటానికి విజన్ 2047 ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు(Nori Dattatreya) పేర్కొన్నారు.

Also Read: Panchayat Elections: పోలింగ్‌లో ఆ జిల్లానే టాప్.. ఎంత శాతం ఓటింగ్ నమోదు అయ్యిందంటే?

గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా..

ప్రజారోగ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు ఉపయోగపడుతాయని చెప్పారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయని అన్నారు. ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్(Hyderabad), ఫ్యూచర్ సిటీకి ర‌ప్పించి తెలంగాణ‌ను భార‌త దేశ స్టార్ట‌ప్‌గా, మాన‌వ వనరుల అభివృద్దికి తెలంగాణ(Telangana) ప్ర‌పంచ కేంద్రంగా మారుతుంద‌ని రేవంత్ రెడ్డి రుజువు చేశారని అభినందించారు.

Also Read: CS Ramakrishna Rao: రాష్ట్రపతి విడిదికి విస్తృత ఏర్పాట్లు.. విద్యుత్, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి : సీఎస్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క