Kalvakuntla Kavitha: సీఎం అవుతా.. నేనేంటో చూపిస్తా: కవిత
Kalvakuntla Kavitha (Image Source: Twitter)
Telangana News

Kalvakuntla Kavitha: నేను సీఎం అవుతా.. నా పవరేంటో చూపిస్తా.. కవిత స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీ న్యూస్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపారు. తనపై, తన భర్త అనిల్ పై నిరాధార భూ కబ్జా ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ కవిత న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మాటలు జాగ్రత్త.. ఊరుకోను

తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీకు దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ.. నామీద ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదు. నాపై అసత్య ఆరోపణలు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను. గత ఐదేళ్ల పాలనలో నా భర్తపై ఒక్క ఆరోపణ రాలేదు’ అని కవిత పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay vs Etela Rajender: కరీంనగర్‌లో ఈటలపై కుట్ర.. ప్రత్యర్థులకు బండి ఫండింగ్?

ఏదోక రోజు సీఎం అవుతా

తెలంగాణలో 2014 నుంచి జరిగిన అన్యాయాలపై తాను స్పందిస్తానని కవిత స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తాను బహిరంగంగా ప్రజలను క్షమాపణ కోరతానని.. అందుకు ఏమాత్రం సందేహించనని అన్నారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉండే వ్యక్తిని తాను కాదని కవిత తేల్చి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నంత ఓపిక తనకు లేదన్నారు. తానేమీ గాంధీని కాదని పేర్కొన్నారు. తానసలే మంచిదాన్ని కాదని వార్నింగ్ ఇచ్చారు. దేవడి దయతో తాను ఏదోక రోజు సీఎం అవుతానని కవిత అన్నారు. నాకూ టైమ్ వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. అప్పటి వరకూ తెలంగాణ జరిగిన అన్యాయాలపై ఆరా తీస్తానని కవిత తేల్చి చెప్పారు.

Also Read: Bharani Exit: బిగ్ బాస్ పోరు నుంచి భరణి అవుట్.. ‘కీ టూ సక్సెస్’ టాస్క్‌లో పాపం ఇమ్మానియేల్..

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం