Kodanda Reddy: రైతు కమిషన్‌ను ఆశ్రయించిన రైతులు
Kodanda Reddy ( image credit: swetcha reporter)
Telangana News

Kodanda Reddy: రైతు కమిషన్‌ను ఆశ్రయించిన రైతులు.. ప్రైవేట్ సీడ్ కంపెనీ మోసంపై ఫిర్యాదు!

Kodanda Reddy: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు రైతు కమిషన్‌ను ఆశ్రయించారు. నకిలీ వరి విత్తనాలతో మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డిని వేడుకున్నారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీని నమ్మి 40 మంది రైతులు 100 ఎకరాలకుపైగా వరి సాగుచేస్తే ఆశించిన దిగుబడి రాలేదని, పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని వాపోయారు. సీడ్ కంపెనీ వాళ్ళు ఎకరానికి 30-35 క్వింటాళ్ల ధాన్యం పండుతుందని, కోత సమయంలో వచ్చి ప్రభుత్వం ఇచ్చే ధరకంటే క్వింటాల్‌కు అదనంగా రూ.150 ఇస్తామని ఆశపెట్టారని తెలిపారు.

Also Read: Kodanda Reddy: పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : గవర్నర్ తో రైతు కమిషన్ భేటి

రైతులు ఆవేదన వ్యక్తం

కానీ, ఇప్పుడు చూస్తే నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్లు రావడంతో వరి సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైందని కమిషన్ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సీడ్ కంపెనీల మోసాన్ని కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే అధికారులు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. తమకు నష్టపరిహారం ప్రకటించడం లేదన్నారు. రైతు కమిషన్ చొరవ తీసుకొని రుక్మాపూర్ రైతులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆవేదన విన్న కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఒకటి రెండు రోజుల్లో అధికారులను ఫీల్డ్‌లోకి పంపి నివేదిక తెప్పించుకున్న తర్వాత న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!